కొన్ని కొన్ని కాంబినేషన్స్ కలిసుంటే బాగుంటుంది. ఆ కలయికలో సినిమా అంటే ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోతాయి. త్రివిక్రమ్ దర్శకుడిగా పరిచయం కాకముందు ఆయన కథలతో దర్శకుడు విజయ్ భాస్కర్ తీసిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. త్రివిక్రమ్ కథ లేకుండా విజయ్ భాస్కర్ తీసిన సినిమాలన్నీ నిరాశే మిగిల్చాయి. ఇలా మరో కాంబినేషన్ విడిపోయిందట. 


దర్శకుడు నక్కిన త్రినాథరావు.. రచయిత బెజవాడ ప్రసన్న కుమార్ కాంబినేషన్ అంటే మూడు సినిమాలు గుర్తొస్తాయి. ఈ కలయికలో వచ్చిన సినిమా చూపిస్తా మామ.. నేను లోకల్.. హలో గురు ప్రేమకోసమే సక్సెస్ అయ్యాయి. ఈ ఇద్దరి కలయికలో సినిమా వచ్చి ఏడాది దాటింది. వెంకటేశ్ కోసం ఓ కథ ప్రిపేర్ చేసినా.. హీరోకు నచ్చలేదని తెలిసింది. నక్కిన త్రినాథరావు, బెజవాడ ప్రసన్నకుమార్ కాంబినేషన్ లో సినిమా రావడం కష్టమేనట. రచయిత బెజవాడ ప్రసన్నకుమార్ డైరెక్షన్ ట్రైల్స్ లో ఉన్నాడనీ.. దీంతో బైట సినిమాలకు పనిచేయడం మానేయాలని డిసైడ్ అయ్యాడట. 

 

త్రివిక్రమ్, విజయ్ భాస్కర్ మాదిరి మరో హిట్ కాంబినేషన్ కు బ్రేకులు పడ్డాయి. రచయిత బెజవాడ దర్శకత్వం చేసే ఆలోచనలో ఉండటంతో.. దర్శకుడు తన తర్వాతి మూవీతో రచయితగా మారతాడా..? లేదంటే వేరే రైటర్ తో వర్క్ చేస్తాడో చూడాలి. ప్రేక్షకులు కూడా హిట్ కాంబినేషన్  కోరుకుంటున్నారు. కనీసం తమకోసమైనా కలిసి వర్క్ చేయాలని ఆశపడుతున్నారు. త్రివిక్రమ్ కథలతో విజయ్ భాస్కర్ తీసిన సినిమాలు అప్పట్లో మంచి హిట్ టాక్ సొంతం చేసుకున్న విషయాలన్ని గుర్తు చేసుకుంటున్నారు. త్రివిక్రమ్ తో సంబంధం లేకుండా దర్శకత్వం వహించిన విజయ్ భాస్కర్ ఫ్లాప్ లతో ఎలా నిరుత్సాహానికి గురైన విషయాన్ని నెమరువేసుకుంటున్నారు. ఇలా కాకుడదు అనుకుంటే.. మున్ముందు త్రివిక్రమ్ స్టోరీతో విజయ్ భాస్కర్ దర్శకత్వం వస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: