సండే వచ్చిందంటే చాలు ముక్క లేనిదే ముద్ద దిగదని మారాం చేసేవాళ్లు ఎంతోమంది ఉంటారు. సండే వచ్చిందంటే మాంసాహారం తినే ప్రతి ఇంట్లో చికెన్, మటన్, చేపలతో తయారైన రకరకాల కూరలతో వంటగది ఘుమఘుమలాడిపోతుంది. కానీ తెలంగాణలోని ఆ గ్రామంలో మాత్రం ఆదివారం రోజు చికెన్, మటన్, చేపలతో తయారైన వంటలు మరేదైనా మాంసాహారం వండరాదు. ఆదివారం రోజు ఆ గ్రామంలో ఎవరూ మద్యం తాగరాదు. 
 
దాదాపు పది సంవత్సరాల నుండి ఆ గ్రామ ప్రజలు ఈ ఆచారాన్ని ఫాలో అవుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో జగిత్యాల జిల్లాలోని మెట్ పల్లి మండలంలోని పెద్దాపుర్ గ్రామ ప్రజలు ఈ ఆచారాన్ని ఫాలో అవుతున్నారు. కొండప్రాంతమైన పెద్దాపూర్ గ్రామంలోని ప్రజలు ఆదివారం రోజున మద్యం తాగరు... మాంసం తినరు. ఎవరైనా మద్యం తాగినట్టు, మాంసం తిన్నట్టు ఆ ఊరి గ్రామ పెద్దలకు తెలిస్తే గ్రామ పెద్దలు మద్యం తాగిన, మాంసం తిన్నవారికి జరిమానా విధిస్తారు. 
 
ఆదివారం రోజున ఆ గ్రామంలో మాంసం అమ్మరాదనే నిబంధన కూడా ఉంది. పది సంవత్సరాలుగా ఈ ఆచారాన్ని గ్రామ ప్రజలు ఆచరించటానికి దేవునిపై ఉన్న భక్తే కారణం. పెద్దాపూర్ గ్రామ ప్రజలు మల్లన్న దేవుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. పెద్దాపూర్ గ్రామం మధ్యలో మల్లన్న దేవునికి ఆలయం కూడా ఉంది. మల్లన్నకు ఎంతో ఇష్టమైన ఆదివారం రోజున మద్యం తాగకూడదని, మాంసం తినకూడదని గ్రామ ప్రజలంతా కలిసి నిర్ణయం తీసుకున్నారు. 
 
పది సంవత్సరాల క్రితం తీసుకున్న ఈ నిర్ణయాన్ని గ్రామ ప్రజలంతా పాటిస్తున్నారు. ఎవరైనా ఈ నియమాన్ని ఉల్లంఘించినట్టు తేలితే వారికి జరిమానా విధిస్తారు. ప్రతి సంవత్సరం మల్లన్న స్వామికి ఉత్సవాలను చేయటంతో పాటు భక్తిశ్రద్ధలతో దేవుడిని కొలుస్తారు. దేవుడిపై ఉన్న భక్రిశ్రద్ధల వలన తాము ఆదివారం మాంసం తినకూడదని, మద్యం తాగకూడదని నిర్ణయం తీసుకున్నామని ఆదివారం రోజున మద్యం, మాంసం ముట్టమని గ్రామస్థులు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: