కొందరు తమజీవిత కాలం రాజకీయాల్లో దొర్లిన గాని ఆస్తులు కూడ బెట్టుకోరు. మరి కొందరు మా అంటే ఓ వందల కోట్లు అక్రమంగా సంపాదించుకుంటారు. కానీ అదృష్టమంటే శశికళదే అని అనుకోక తప్పదు. ఎందుకంటే ఆమె ఆస్తుల విలువ తెలిస్తే దిమ్మతిరిగి బొమ్మ కనబడుద్దంటున్నారు. తాజాగా ఈవిడగారు చేసిన అవినీతికి సంబంధించిన వివరాల ప్రకారం. ఆదాయపన్ను శాఖ తన నోటీసులో ఆరోపించిన ఆస్తులను పరిశీలిస్తే రద్దైన నోట్లతో దాదాపు 1674.50 కోట్ల విలువైన ఆస్తిపాస్తులను సమకూర్చుకున్నట్టు తెలిసింది.

 

 

శశికళకు ఆస్తులు అమ్మిన వ్యక్తులు ఆ పాత నోట్లను 2016 నవంబర్ 8 నుంచి డిసెంబర్ 30 మధ్య వివిధ బ్యాంక్ అకౌంట్లలో డిపాజిట్ చేసినట్టు ఆదాయపన్ను శాఖ పేర్కొంది. ఇదే కాకుండా పెద్ద నోట్ల రద్దు సమయంలో శశికళ చెన్నై పెరంబూరు, మదురై, కేకే నగర్‌లలో షాపింగ్‌ మాల్స్‌ పుదుచ్చేరిలో ఒక రిసార్ట్, కోయంబత్తూరులో పేపర్‌ మిల్, చెన్నై ఒరగడంలో చక్కెర మిల్లు, పాత మహాబలిపురం రోడ్డులో సాఫ్ట్‌వేర్‌ కంపెనీ, కోయంబత్తూరులో 50 పవన విద్యుత్‌ ప్లాంట్‌లు కొనుగోలు చేసినట్టు ఐటీ తరఫు న్యాయవాది అక్రమ ఆస్దులకు సంబందించిన ఆధారాలను కోర్టు దృష్టికి తెచ్చారు.

 

 

ఈ ఆస్తులన్నీ నగదు ద్వారానే జరిగినట్టు అందులో పేర్కొన్నారు.. ఇకపోతే జైలుకు వెళ్లిన శశికళ పెరోల్‌పై బయటకు వచ్చిన సమయంలో కొన్ని ఆస్తులు చేతులు మారినట్లు కనుగొన్నారు.  ఓ లావాదేవీకి సంబంధించి నవీన్ బాలాజీ అనే వ్యాపారీ ఇచ్చిన వాంగ్మూలాన్ని ఆదాయపు పన్ను శాఖ తన నోటీసులో పొందుపరిచింది. ఆ సమయంలో ఏం జరిగిందనేది నవీన్ ఆదాపు పన్ను శాఖ అధికారులకు సవివరంగా చెప్పారు. ఇకపోతే ఇతనే కాకుండా ఇటువంటి ఒప్పందాన్నే కుదుర్చుకున్న రామకృష్టా రెడ్డి అనే వ్యాపారీ స్టేట్‌మెంట్‌ను కూడా ఆదాయపు పన్ను శాఖ నోటీసులో పొందుపరిచింది. మొత్తంగా రూ 1674.50 కోట్ల  విలువైన 12 లావాదేవీలు జరిగినట్లు ఆదాయపుపన్ను శాఖ తెలిపింది... 

మరింత సమాచారం తెలుసుకోండి: