భూమి పైన వాతావరణం కాలాన్ని బట్టి మారుతుంది శీతాకాలం అని వేసవి కాలం అని వర్షాకాలం అని సంవత్సరాన్ని వివిధ కాలాలుగా విభజించారు.  చలికాలం మంచు సాధారణమే. దానితో పాటు రాత్రి సమయం కంటే పగటి సమయం తక్కువ ఉండటం కూడా మామూలే.  అయితే  సాధారణంగా చలికాలం పగలు కంటే రాత్రి ఎక్కువ అంటారు  ఎలా అంటే వేసవి కాలంలో సాయంత్రం 7 అయినా చీకటవ్వదు అదే చలికాలం 6 గంటలకే చీకటవుతుంది.

కాని విచిత్రంగా  ఏడాదిలో ఓ సారి వచ్చే చలికాలంలో కేవలం ఈ ఒక్కరోజే పగటి సమయం తక్కువగా ఉంటుందట. డిసెంబరు 22ఆదివారం పగటి సమయం తక్కువగా ఉంటుందని గూగుల్ ప్రత్యేకమైన డూడుల్‌తో దర్శనమిచ్చింది. దీనితో అందరు అది ఎలా అని ఆలోచనలో పడ్డారు.అది ఎలా అంటే  ఒక్కో అర్ధ గోళం మారినప్పుడూ ఒక్కోసారి ఇలా సంవత్సరానికి రెండుసార్లు జరుగుతుంది. భూమి ఉత్తరార్ధగోళంలో ఉన్నప్పుడు డిసెంబరులోనూ, దక్షిణార్ధగోళంలో ఉన్నప్పుడు జూన్‌లోనూ అయనాంతాలు ఏర్పడతాయి. వీటి ద్వారానే కాలాలు నిర్ణయిస్తారు. గూగుల్ డూడుల్  ప్రకారం డిసెంబరు 22 ఆదివారం నుంచి 2020 మార్చి 20 శుక్రవారం వరకూ చలికాలం అని నిర్దారించింది.

మనం సాధారణంగా ఏదైనా మంచిరోజు ఉంది అంటే ఆ రోజే ఏమైనా కార్యక్రమాలు ఉంటె  పెట్టుకుంటాం అలాంటిది సంవత్సరం లో రెండుసార్లు వచ్చే రోజులు కాబట్టి కొన్ని వందల సంవత్సరాలుగా దీనిని ఆస్ట్రానామికల్ మైల్‌స్టోన్‌గా ప్రపంచస్థాయిలో సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నారు. చలికాలం ఆరంభాన్ని యూదులు టెకుఫట్ టెవెట్ అని, ఈజిప్టులు ఐసీస్ దేవత కొడుకు హారస్ పుట్టినరోజు అని 12రోజుల పాటు జరుపుకుంటారు. చైనాలో కుటుంబాలు అంతా ఒకచోట కలిసి విందు భోజనం చేసి సెలబ్రేట్ చేసుకుంటారు. ఇలా నిన్నటి రోజు ఆ ప్రత్యేకమైన రోజు కాబట్టి గూగుల్ డూడుల్ లో ఆ రోజు సందర్బంగా వివిధ చిత్రాలు దర్శనమిచ్చాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: