దిశ నిందితులకు రీపోస్ట్ మార్టమ్ నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 23 సాయంత్రం లోపు అది జరగాలని సూచించింది. ఆ తర్వాత మృతదేహాల్ని కుటుంబ సభ్యులకు అప్పగించవచ్చని డైరక్షన్ ఇచ్చింది. 

 

దిశ హత్యాచారం కేసు నిందితులకు మళ్లీ శవపరీక్ష నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 23 సాయంత్రం 5గంటలలోపు రీ పోస్టుమార్టం నిర్వహించాలని చెప్పింది. ఢిల్లీ ఎయిమ్స్‌ ఫోరెన్సిక్‌ నిపుణులతో ఈ ప్రక్రియ నిర్వహించాలని, అనంతరం మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించాలని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు ఆదేశించింది.

 

సుదీర్ఘ వాదనలు విన్న ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు ఎన్‌కౌంటర్‌లో వినియోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకొని వాటిని సీఎఎస్‌ఎస్‌ఎల్‌కు పంపాలని చేసుకోవాలని హైకోర్టు సిట్‌ను ఆదేశించింది. విచారణకు గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ శ్రవణ్‌ వ్యక్తిగతంగా హాజరయ్యారు. ఐదారు రోజుల్లో మృతదేహాలు పూర్తిగా దెబ్బతినే ప్రమాదముందని కోర్టుకు వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

 

అంతకుముందు.. గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ శ్రవణ్ హైకోర్టుకు దిశ నిందితుల మృతదేహాల పరిస్థితిని హైకోర్టుకు వివరించారు. నిందితుల మృతదేహాలు ఇప్పటి వరకు 50 శాతం డీ కంపోజ్ అయ్యాయని శ్రవణ్ కోర్టుకు తెలిపారు. -2 నుంచి -4 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద నాలుగు మృతదేహాలను ప్రీజర్‌లో ఉంచామని స్పష్టం చేశారు. ఇంకా మృతదేహాలు ఫ్రీజర్‌లలో ఉంటే వారం రోజుల్లో పూర్తిగా 100 శాతం డీ కంపోజ్ అవుతాయని శ్రవణ్ కోర్టుకు వెల్లడించారు.

 

దేశంలోని ఇతర ఆసుపత్రుల్లో మృతదేహాలను భద్రపరచడానికి ఫెసిలిటీ ఉందా అని హైకోర్టు ప్రశ్నించింది. దీనికి తెలియదని శ్రవణ్ బదులిచ్చారు. డిసెంబర్ 9న మృతదేహాలను గాంధీకి తీసుకొచ్చారని శ్రవణ్ కోర్టుకు తెలిపారు. మొదట మృతదేహాలకు పోస్టుమార్టం చేసిన వైద్యుల వివరాలను ఏజీ కోర్టుకు తెలిపారు. మరోవైపు తమకు న్యాయం జరిగేవరకు.. శవాలు తీసుకోబోమని దిశ నిందితుల బంధువులంటున్నారు.. మరి ఏం జరుగుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: