క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఐదు రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ ఏపికి మూడు రాజధానులు అవసరమని ప్రతిపాదించారు. విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యుడిషియల్ క్యాపిటల్ ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు. ఇక వెలగపూడిలో అంటే అమరావతిలో ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ, రాజభవన్ ఇక్కడే కంటిన్యు అవుతాయని చెప్పిన విషయం అందరికీ తెలిసిందే.

 

జగన్ ఎప్పుడైతే విశాఖపట్నం, కర్నూలు కూడా రాజధానులుగా ఉండచ్చు అని ప్రతిపాదించారో అప్పటి నుండే చంద్రబాబునాయుడులో టెన్షన్   మొదలైపోయింది. దానికి తగ్గట్లే పార్టీలోని కొందరు సీనియర్లు కూడా జగన్ చేసిన ప్రకటనకు మద్దతుగా మాట్లాడటం, జగన్ ప్రతిపాదనకు స్వాగతం చెప్పటంతో  చంద్రబాబు ఇబ్బందులు మొదలైపోయాయి.

 

జగన్ ప్రతిపాదనపై ఏమి మాట్లాడితే జనాల్లో ఎటువంటి రియాక్షన్ వస్తుందో  అన్న టెన్షన్ తోనే అసలు విశాఖపట్నం, కర్నూలు గురించే మాట్లాడటం మానేశారు. జగన్ ప్రతిపాదన రాగానే రాజధానిని తరలించటానికి వీల్లేదంటూ అమరావతి ప్రాంతంలోని ఓ సెక్షన్ రైతులు ఆందోళన చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అదే విధంగా జగన్ ప్రతిపాదనకు మద్దతుగా ఉత్తరాంధ్ర, రాయలసీమ జనాలు అంతే స్ధాయిలో సంబరాలు జరుపుకుంటున్నారు.

 

ఈ నేపధ్యంలోనే  జగన్ ప్రతిపాదనలో అర్ధం లేదని అంటున్నారే కానీ విశాఖపట్నంలో రాజధాని ఏర్పాటుకు తాను వ్యతిరేకమని నేరుగా చెప్పలేకున్నారు. మామూలుగానే ఏ విషయాన్ని కూడా నేరుగా చెప్పే అలవాటు లేదు. అలాంటిది  రాజధాని తరలింపు లాంటి కీలకమైన అంశం మీద మాట్లాడాలంటే అలవాటైన డొంకతిరుగుడు విధానాన్నే చంద్రబాబు ఫాలో అవుతున్నారు.

 

ఇందులో భాగంగానే రాజధాని పై ఉత్తరాంధ్ర నేతలు, హై కోర్టు ఏర్పాటుపై కర్నూలు నేతలు ఎవరూ బహిరంగంగా మాట్లాడవద్దని  నేతలను చంద్రబాబు మూడు రోజుల క్రితమే ఆదేశించారు. అయితే ఆయా ప్రాంతాల్లోని జనాల మనోభావాలను, ఒత్తిళ్ళను తట్టుకోలేక చివరకు జగన్ నిర్ణయానికి మద్దుతుగా టిడిపి నేతలు మాట్లాడుతున్నారు. దాంతో చంద్రబాబు మాట చెల్లుబాటు కావటం లేదని తెలిసిపోతోంది. అందుకనే విశాఖపట్నం, కర్నూలు నగరాల గురించి చంద్రబాబు ఎక్కడా మాట్లాడటం లేదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: