మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వం సవరణ బిల్లును కాంగ్రెస్ తో పాటు కొన్ని ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.  ఈ బిల్లు వలన దేశంలో ముస్లింలు ఇబ్బందులు పడతారని, ముస్లింలను, హిందువులను వేరు చేయడానికి కేంద్రం ప్రయత్నం చేస్తోందని, దీని వలన హిందువులు కూడా ఇబ్బందులు పడతారని చెప్పి ప్రచారం చేస్తోంది.  దీంతో పాపం ఈ బిల్లు గురించి సరైన అవగాహనా లేకుండానే ప్రతిపక్షాలతో పాటుగా ప్రజలు కూడా చేయికలిపారు.  


ఇక నిరసనకారుల మధ్యలోకి కొంతమంది సంఘవిద్రోహ శక్తులు దూరి అరాచకాలు సృష్టిస్తున్నారు.  ప్రభుత్వం, జాతీయ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు.  ఇలా ధ్వంసం చేసిన ఆస్తులకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దాని ఫలితం తరువాత ప్రజలే అనుభవించాల్సి వస్తుంది.  అందులో సందేహం అవసరం లేదు.  ఇకపోతే, పౌరసత్వం బిల్లు విషయంలో పక్కనే ఉన్న బంగ్లాదేశ్ సపోర్ట్ చేస్తున్నది.  


పౌరసత్వం బిల్లుకు సంబంధించిన అంశం భారత అంతర్గత విషయం అని, దీనిపై తాము కలుగజేసుకోబమని, భారత్ పై తమకు పూర్తి నమ్మకం ఉందని బంగ్లాదేశ్ పేర్కొన్నది.  బంగ్లాదేశ్ బిల్లుకు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించింది.  భారత్ వంటి దేశంలో అనవసరమైన అలజడులు జరిగితే దానివలన పక్కనే ఉన్న తమపై కూడా పడుతుందని, త్వరలోనే అలజడులు తగ్గిపోతాయని ఆశిస్తున్నట్టు బంగ్లాదేశ్ మంత్రులు చెప్తున్నారు.  


తమ దేశ పౌరులు ఎవరెవరు ఉన్నారు... ఎంతమంది ఉన్నారు అనే విషయాలతో కూడిన నివేదికను అందిస్తే వారిని తమ దేశం తిరిగి తీసుకెళ్లేందుకు సంసిద్ధంగా ఉన్నట్టు ఇప్పటికే బంగ్లాదేశ్ తెలియజేసింది.  పక్కనే ఉన్న బంగ్లాదేశ్ వంటి దేశాలు మోడీని విశ్వసిస్తున్నాయి.  కానీ, ఇండియాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలు మాత్రం విశ్వసించడం లేదు.  ఎందుకంటే రాజకీయంగా దెబ్బతింటామేమో అనే భయం.  అందుకే ఈ బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: