రాష్ట్రానికి  ప్రతిపాదించిన మూడు రాజధానుల  విషయంలో  జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో మంచి సపోర్టే వస్తోంది. క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే  మొత్తం 13 జిల్లాల్లో 11 జిల్లాల్లో పూర్తి మద్దతే కనబడుతోంది. విశాఖపట్నంలో ఎగ్జిక్యుటివ్ క్యాపిటల్ ఏర్పాటు జరుగుతోంది కాబట్టి మొత్తం ఉత్తరాంధ్ర అంతా సంబరాలు చేసుకుంటున్నారు. అలాగే కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయబోతున్నారు కాబట్టి రాయలసీమ నుండి మద్దతు లభిస్తోంది.

 

ఇక రాజధాని జిల్లాలైన కృష్ణా, గుంటూరులోని చాలా కొద్ది ప్రాంతంలో మాత్రమే జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి.  కృష్ణా జిల్లాలో ఆందోళనలు కానీ లేకపోతే మరేదైనా రూపంలో కూడా వ్యతిరేకత కనబడటం లేదు. ఇక గుంటూరు జిల్లా అమరావతి ప్రాంతంలోని రాజధాని గ్రామాల్లో మాత్రమే ఆందోళనలు జరుగుతున్నాయి. జరుగుతున్న ఆందోళనలు కూడా కమ్మ సామాజికవర్గం, తెలుగుదేశంపార్టీకి మద్దతుగా నిలిచిన రైతులు, ఇతరుల్లో మాత్రమే ఎక్కువగా  కనబడుతోంది.

 

జగన్ నిర్ణయం ప్రకారం రాజధాని విశాఖపట్నానికి వెళ్ళిపోతే  ముందు నష్టపోయేది కమ్మ, టిడిపిలో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకునే వాళ్ళే ఎక్కువ. కాకపోతే రాజధాని తరలి వెళ్ళిపోతోందంటే రాజకీయాలతో సంబంధం లేని జనాల్లో కూడా బాధ ఉంటుందనటంలో సందేహం లేదు.

 

ఇక జగన్ ప్రతిపాదనకు చాలా జిల్లాల నుండి మద్దతు కనబడుతోంది. రాజధాని వస్తుందనేసరికి ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లోని 34 నియోజకవర్గాల్లో సంబరాలు చేసుకుంటున్నారు. అలాగే హైకోర్టు ఏర్పాటును స్వాగతిస్తు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లోనే కాకుండా మిగిలిన మూడు జిల్లాల్లోని 38 నియోజకవర్గాల్లో కూడా జోష్ కనబడుతోంది. అలాగే  కర్నూలు దగ్గరే కాబట్టి నెల్లూరు, ప్రకాశం జిల్లాలు కూడా బ్రహ్మాండమంటున్నాయి. ఇక విశాఖపట్నం లోని  రాజధాని విషయంలో 19 నియోజకవర్గాలున్న తూర్పు గోదావరి జిల్లాలో కూడా హ్యాపీగానే ఉన్నారు.

 

అంటే మిగిలింది పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలు మాత్రమే. ఈ మూడు జిల్లాల్లో ముఖ్యంగా పశ్చిమగోదావరి జిల్లాలో ప్రత్యేకంగా ఎటువంటి స్పందన కనబడటం లేదు. హోలు మొత్తం మీద  కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని 33 నియోజకవర్గాలను వదిలిపెడితే మిగిలిన 142 నియోజకవర్గాల్లో జగన్ కు మద్దతుందనే అర్ధమవుతోంది. మరి ఇదే లెక్క రాబోయే స్ధానిక సంస్ధల ఎన్నికల్లో  నిజమవుతుందా ?

 

మరింత సమాచారం తెలుసుకోండి: