తెలంగాణ ఆర్టీసీని ప్రపంచ వ్యాప్తంగా వార్తల్లోకి ఎక్కించి, ఇప్పుడు పెరిగిన బస్సు టికిట్ల ధరలతో ప్రజలు రోజు తలచుకుంటున్న నాయకుడు ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వత్థామ రెడ్డికి తెలంగాణ ప్రభుత్వం నుండి కొత్త చిక్కులు వచ్చిపడ్డాయని తెగ ఇదైపోతున్నారట. యాభైవేలమంది ఆర్టీసీ కార్మికులను ఒక్క మాటతో ముందుకు నడిపించిన మా రాజుకు కష్టాలా అని ఆలోచిస్తున్నారా. అక్కడికే వస్తున్నా.

 

 

గత నెలరోజుల క్రిత్రం తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సుదీర్ఘకాల సమ్మెకు సారధ్యం వహించిన జేఏసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డికి కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. సమ్మె కారణంగా వార్తల్లో నిలిచిన అశ్వత్థామరెడ్డి ఇప్పుడు చేయాల్సిన ఉద్యోగాన్ని కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. సమ్మెను దృష్టిలో పెట్టుకున్న సీయం కేసీయార్ ఆర్‌టిసిలో యూనియన్‌లు అనే మాటలేకుండా చేయాలని కంకణం కట్టుకున్నారు. ఆ క్రమంలోనే ఉద్యోగ సంఘాలతో సంబంధం లేకుండా సీయం కేసీయార్ ఆర్‌టిసి కార్మికులతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి వారికి వరాల జల్లు కురిపించి. కార్మికులు యూనియన్‌ల పేరు ఎత్తకుండా చేశారు.

 

 

మరో పక్క ఆర్టీసీ యాజమాన్యం యూనియన్ కార్యాలయాలను కూడా స్వాధీనం చేసుకున్నది. ఇక ఇదే కాకుండా యూనియన్ నేతలకు ఉన్న లీవ్ రిలీఫ్‌ను అధికారులు క్యాన్సిల్ చేశారు. దీంతో అశ్వత్థామరెడ్డి ఆరు నెలల పాటు సెలవు కావాలంటూ యాజమాన్యానికి ధరఖాస్తు పెట్టుకున్నారు. అతను పెట్టుకున్న సెలవును అర్జీసీ యాజమాన్యం క్యాన్సిల్ చేసింది. సంస్థ ఆర్థికంగా నష్టాల్లో ఉందనీ, ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ప్రతి ఒక్క ఉద్యోగి సేవలు అందించాల్సిన అవసరం ఉందనీ అందుకు లీవ్ క్యాన్సిల్ చేస్తున్నట్లు యాజమాన్యం పేర్కొన్నది.

 

 

ఇకపోతే అంతమంది కార్మికులను ముందుండి నడిపించిన మన పెద్దన్నకు వచ్చిన కష్టాన్ని ఎవరికి చెప్పుకోవాలో అర్దం కాకుండా తనలో తానే కుమిలి పోతున్నాడట.. నిజమే కదా ఈ రోజు ప్రజల నెత్తిమీద ఇంతలా భారం పడటానికి ముఖ్య కారకుడైనా పెద్దన్న ఈ చిన్నపాటి భారం కూడ మోయకుంటే ఎలా అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారట.. 

మరింత సమాచారం తెలుసుకోండి: