ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రానికి మూడు రాజధానులను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించినప్పటినుంది రాష్ట్ర రాజధాని వికేంద్రీకరణను వ్యతిరేకిస్తూ ఒక పక్క ప్రతిపక్షాలు అనేకానేక దిక్షలు మరియు మీటింగులు చేపట్తిన నేపథ్యంలో అధికార పక్షం నుండి కూడా అదే రీతిలో రియాక్షన్ మొదలైంది.

 

సమర్ధిస్తూ తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో భారీ ర్యాలీ నిర్వహించారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, రాజధాని వికేంద్రీకరణ జరిగితే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని, ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా తిప్పికొడతామని హెచ్చరించారు.

 

ఇప్పటికే పవన్ కళ్యాణ్ అమరావతిలో రైతులతో కలిసి ధర్నా చేపట్టిన నేపథ్యంలో ప్రభుత్వం వారు కూడా అమరావతిలో రాజధాని కోసం ప్రభుత్వానికి ఇచ్చేసిన భూములను తిరిగి ఇచ్చేశేందుకు యోచిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతానికైతే తెలుగుదేశం పార్టీజనసేన మరియు సిపిఐ జగన్ తీసుకున్న 3 రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉండగా భారతీయ జనతా పార్టీ మాత్రం జగన్ నిర్ణయాన్ని సమ్మతించింది. ఇక సిపిఎం ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉండగా కాంగ్రెస్ పార్టీకి అసలు సరైన నిర్దేశకత్వం లేక వారు ఎటువైపు ఉండాలో కూడా తెలియక సతమతమవుతున్నారు.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: