ఆర్టీసీ బస్సుల్లో  రోజు వేల మంది ప్రయాణిస్తుంటారు. ఎందుకంటే ఆర్టీసీ ప్రయాణం అంటే తక్కువ ఖర్చుతో కూడుకున్నదే కాకుండా సురక్షితమైనది అని ప్రజల నమ్మకం. ఆర్టీసీలో టికెట్ చార్జీలు కూడా చాలా తక్కువ ఉంటాయి . ఇకపోతే ఆర్టీసీ బస్సులో ఎక్కిన వాళ్ళు తప్పక టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ కొంతమంది ఆకతాయిలు మాత్రం టికెట్ తీసుకోకుండానే ప్రయాణం చేస్తూ ఉంటారు. అయితే టికెట్ తీసుకోకపోతే 500 రూపాయల జరిమానా కట్టాల్సి వస్తుంది అని బస్సులో ప్రతీ చోట రాసిపెట్టి ఉన్నప్పటికీ కొంతమంది మాత్రం టికెట్ తీసుకోవడానికి అస్సలు  ఇష్టపడరు . ఇంకొంతమంది బస్పాస్ లేకపోయినా కండక్టర్ అడగగానే పాస్ ఉందని చెప్పి టికెట్ తీసుకోకుండానే ప్రయాణం చేస్తూ ఉంటారు. 

 

 

 

 ప్రతిరోజు ఆర్టీసీ బస్సులో ఇలాంటి టికెట్ లేకుండా ప్రయాణం చేసే ఆకతాయిలు ఎంతోమంది. ఇలాంటి వారు కొన్ని కొన్ని సార్లు చెకింగ్ అధికారులకు దొరికితే జరిమానాలు పడినప్పటికీ ఇలాంటి వాళ్లు మాత్రం మార్పు రాదు. ఇంకొంతమంది కండక్టర్  టికెట్ తీసుకోమని అడగలేదని...  తన వైపు టికెట్ తీసుకోవటానికి  రాలేదని బుకాయిస్తూ ఉంటారు.ఏదో ఒక విధంగా కండక్టర్ను బురిడీ కొట్టించి బస్సులో టికెట్ తీసుకోకుండానే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. పక్కన ఉన్న వాళ్ళు టికెట్ తీసుకోమని చెప్పినప్పటికీ... ఏం తీసుకుంటాముళే  అంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఇలాంటి వారి వల్ల అటు ఆర్టీసీ కండక్టర్ ల  ఉద్యోగానికి కూడా కాస్త ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి.  టికెట్ తీసుకోకుండా చెకింగ్ అధికారులకు ఎప్పుడైనా దొరికితే... 500 జరిమానా విధించడమే కాకుండా కండక్టర్ లకు కూడా అధికారులు నోటీసులు జారీ చేసేవారు  అధికారులు . కానీ ఇప్పుడు రూల్  మారింది. 

 

 

 

 ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ టికెట్ తీసుకోకుండా కండక్టర్ను బురిడీ కొట్టించి ప్రయాణాలు చేసే వారి పట్ల కఠిన నిబంధనలు అమలు చేసేందుకు ఆర్టీసీ నిర్ణయించింది. టికెట్ తీసుకోకుండా బస్సుల్లో ప్రయాణించడం నేరం..  500 జరిమానా అంటూ ఆర్టీసీ బస్సు లో ఉండే నిబంధనలను ప్రస్తుతం... పక్కాగా అమలు చేయాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీని కోసం ఆర్టీసీ ప్రయాణికుల్లో అవగాహన కల్పించాలని తెలంగాణ ఆర్టీసీ భావిస్తోంది. ఒకవేళ కండక్టర్ టికెట్ ఇవ్వకపోయినా కండక్టర్ ను  అడిగిమరీ టికెట్ తీసుకోవాలని.. లేకపోతే 500 రూపాయల జరిమానా తప్పదు అంటూ తెలిపింది  టిఎస్ఆర్టిసి. గతంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణించే ప్రయాణికులు  టికెట్టు తీసుకోకపోతే దీనికి కండక్టర్ ని బాధ్యులుగా చేసేవారు...కాని ఇప్పుడు  మాత్రం  పూర్తి బాధ్యత ప్రయాణికుడిదే.

మరింత సమాచారం తెలుసుకోండి: