దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఎన్కౌంటర్ నిందితులకు ఈరోజు రీపోస్టుమార్టం జరగనుంది. తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు దిశ నిందితుల మృతదేహాలకు రీపోస్టుమార్టం నిర్వహించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. తెలంగాణతో అసలు సంబంధంలేని డాక్టర్లతో ఈ రీపోస్టుమార్టం ప్రక్రియ చేపట్టాలని హైకోర్టు షరతు విధించింది. 

                         

దీంతో ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ రిక్వెస్ట్ మేరకు.. ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్'ఎయిమ్స్' న్నుండి  నలుగురు నిపుణులతో కూడిన టీమ్ ను హైదరాబాద్ పంపేందుకు అంగీకరించింది. ఆ టీం ఈరోజు ఉదయం 9 గంటలకు గాంధీ ఆస్పత్రి మార్చురీలో రీపోస్టుమార్టం ప్రారంభిస్తారు. ప్రక్రియ మొత్తాన్నీ వీడియో తీసి, కలెక్షన్స్‌ ఆఫ్‌ ఎవిడెన్స్‌ను సీల్డ్‌ కవర్‌లో భద్రపరుస్తారు.  

                         

రీపోస్టుమార్టం పూర్తయిన వెంటనే నలుగురు నిందితుల మృతదేహాలను వారి బంధువులకు అప్పగించాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో రీపోస్టుమార్టం అయిన వెంటనే సోమవారమే ఆ నిందితుల మృతుదేహాలను కుటుంబాలకు అప్పగించనున్నారు. అనంతరం ఆ నిందితులకు అంత్యక్రియలు జరిపించేలా ఆయా కుటుంబాలను పోలీసులు ఒప్పించారు. 

               

కాగా గత నెల 27వ తేదీన వెటర్నరీ వైద్యురాలైన దిశను షాద్ నగర్ లో అత్యాచారం చేసి సజీవదహనం చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఆ నిందితులు 24గంటల్లోనే దొరకగా ఆ నలుగురిని కేసు విచారిస్తుండగా.. ఈ నెల 6వ తేదీన ఘటన స్థలంలో కేసు రీ కంస్ట్రక్ట్ చేస్తున్న సమయంలో నిందితులు పారిపోవడానికి ప్రయత్నించగా ఆ నలుగురిపై పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో ఆ నిందితులు అక్కడిక్కడే మరణించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: