ఎన్నికలో ఒక పార్టీ నుంచి గెలిచిన తర్వాత అధికార పార్టీకి మారే నాయకుల పై కఠిన చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఈ విధంగా ఒక పార్టీ నుంచి ఒక పార్టీ మారడం అనేది ప్రజాస్వామ్యంని అవహేళన చేయటమే   అని ఆయన చెప్పారు. ఇలా రాజకీయ ఫిరాయింపుల చేసే నాయకులకి ఫిరాయింపుల నిరోధక చట్టానికి మరింత పదును పెట్టాల్సిన అవసరం ఇప్పుడు ఉందని ఆయన పేర్కొన్నారు.

 

 ఈనెల 18న జరిగిన చట్టసభల సభాపతుల సదస్సుకు హాజరైన ఈయన ఢిల్లీలోని ఏపీ భవన్లో ఆదివారం మాట్లాడుతూ, సభాపతులు సదస్సులో నేను పలు రాష్ట్రాల్లో సభాపతులు ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని మరింత పటిష్టం చేయాలని ప్రస్తావించడం జరిగింది. ఈ చట్టంలో ఉన్న స్పష్టత లోపాల కారణంగా ఇప్పటికీ ఫిరాయింపులు కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. గత టిడిపి ప్రభుత్వం లో 23 మంది వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు టిడిపి లోకి మారినా కూడా అప్పటి సభాపతి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.

 

దీని వల్ల ప్రజలు ప్రజాస్వామ్యంపై నమ్మకం కోల్పోయే పరిస్థితి వస్తుందని ఆయన చెప్పారు. శాసనసభ గడువు పూర్తిగా తీరే లో కూడా సంబంధిత పిటిషన్లు పరిష్కరించకపోవడంతో వాటికి కాలం చెల్లిన పరిస్థితి దాపురిస్తుంది. అయినా మరోసారి ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్లే ఆలోచనలో ఉన్న నాయకులు ముందుగా రాజీనామా చేసి తర్వాత ఎన్నికలకు వెళ్లి మరి అప్పుడు పార్టీ మారాలని అన్నారు. ఇలా చేస్తే రాజకీయాల్లో ఇదో గొప్ప ముందడుగు అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

 

సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా  వదులుకోవాలన్న నిబంధనలో కూడా స్పష్టత లేకపోవడం వల్ల శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ మధ్య భేదాభిప్రాయం తలెత్తుతోంది. ఫిరాయింపుల చట్టంలో ఉన్న విలీన నిబంధనను ఉపయోగించి పార్టీ మారుతున్నారు.అని తమ్మినేని సీతారాం  అభిప్రాయపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: