తెలంగాణ కాంగ్రెస్ ఈ నెల 28న పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ.. భారీ ర్యాలీ చేయాలని నిర్ణయించింది. గాంధీ భవన్ నుంచి మొదలుకుని.. అంబేద్కర్ విగ్రహం వరకు ఈ పాదయాత్ర జరగనుంది. దీని కోసం ఇప్పటికే పోలీసులను అనుమతి కోరింది సీఎల్పీ. ప్రొఫెషనల్ కాంగ్రెస్ అద్వర్యంలో అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన తెలిపారు. 

 

పౌరసత్వ బిల్లును నిరసిస్తూ ప్రొఫెషనల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి గీతారెడ్డి అధ్యక్షతన అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన వ్యక్తం చేశారు. సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల మధ్య అంతరాలను పెంచేలా బిల్లు ఉందని ఆరోపించారు. కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు.

 

పౌరసత్వ సవరణ బిల్లుతో రాజ్యాంగాన్ని బీజేపీ ప్రభుత్వం నాశనం చేసిందని ఆరోపించారు పీసీసీ చీఫ్ ఉత్తమ్. దేశ వ్యాప్తంగా ఆందోళనలు పెల్లుబుకుతున్నా... బిల్లును అలాగే అమలుచేస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. ఈ నెల 28న గాంధీ భవన్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీని నిర్వహిస్తామన్నారు. ఎంఐఎం కేసీఆర్ కి ధన్యవాదాలు చెప్పడం కాదు... తెలంగాణలో పౌరసత్వ సవరణ బిల్లును అమలుచేయకుండా ఆపాలని కోరారు ఉత్తమ్.

 

పౌరసత్వ సవరణ బిల్లు దేశ ప్రజలందరికీ నష్టం కలిగిస్తుందని కాంగ్రెస్ వాదిస్తోంది. ఏ వర్గానికి అనుకూలంగానో... వ్యతిరేకంగానో ఆందోళనలు చేయటం లేదనే క్లారిటీ ఇచ్చే పనిలో పడింది కాంగ్రెస్. సవరణ బిల్లును వెన్కక్కి తీసుకునేంత వరకు ఆందోళనలకు కొనసాగుతాయని స్పష్టం చేశారు కాంగ్రెస్ నేతలు. 

 

పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ఇప్పటికే ఆందోళనలు జరుగుతూనే ఉన్నారు. నిరసన కారులు పలు చోట్ల విధ్వంసాలకు కూడా పాల్పడుతున్నారు. పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆస్తులు నష్టపోతున్నాయి. ఎక్కడికక్కడ రోడ్లపై బైఠాయించి నల్ల జెండాలతో.. నిరసన ప్లకార్డులతో తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  కేంద్ర ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: