తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడు, ఆ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటు పార్టీలో అటు ప‌రిపాల‌న‌లో త‌న ముద్ర వేసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. గ‌తంలో వాలే కాకుండా ప్ర‌జ‌లు అనుసంధానం అయ్యేందుకు ట్విట్ట‌ర్‌ను వేదిక‌గా వాడుకుంటున్న కేటీఆర్‌..ఇప్ప‌టికే కార్య‌క‌ర్త‌ల‌కు పెద్ద ఎత్తున అనుసంధానం అయ్యారు. ఇదే ఒర‌వ‌డిలో ప‌రిపాల‌న‌లో మ‌రో ముద్ర వేసేలా కేటీఆర్ ముందుకు సాగుతున్నారు. రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ త‌ర్వాత కేటీఆర్ మ‌రో న‌గ‌రంపై ఫోక‌స్ పెట్ట‌డం, అ ందులో కీల‌క ముంద‌డుగు ప‌డ‌టం తాజా ప‌రిణామం.

 

ఇప్పటివరకు హైదరాబాద్‌కు పరిమితమైన ఐటీ రంగాన్ని ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించి.. ఎక్కడి యువతకు అక్కడే ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్యంతో ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక ప్రణాళికలు సిద్ధంచేసిన విషయం తెలిసిందే. ఇందులోభాగంగానే కరీంనగర్ ఐటీ టవర్ ఏర్పాటుకు 2018 జనవరి 8న ఆయన శంకుస్థాపనచేశారు. హైదరాబాద్ తర్వాత కరీంనగర్ నిర్మిస్తున్న అతిపెద్ద ఐటీ టవర్ ప్రారంభోత్సవానికి సిద్ధమయింది. ప్లగ్ అండ్ పే సిస్టమ్ ఏర్పాటు చేస్తున్న ఈ టవర్ మొత్తం సెంట్రల్ ఏసీతో ఉంటుంది. ముఖ్యంగా ఒక్కో ఫ్లోర్ ఒక షిఫ్టులో 200ల మంది పనిచేసుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. అలా ఐదు ఫ్లోర్లలో ఒకే షిప్టులో వెయ్యిమంది పనిచేసేందుకు కావాల్సిన వసతులు కల్పించారు. మూడుషిప్టుల్లో కలిపి మూడువేల మందికి ఇక్కడ ఉద్యోగఅవకాశాలు కల్పించాలని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, మంత్రి గంగుల కమలాకర్ నిర్ణయించారు. రెండేండ్లలోనే 65 వేల చదరపు అడుగుల విస్తీర్ణం గల ఐటీ టవర్ ఏర్పాటు చేశారు. 

 


దాదాపు మూడువేల మందికి ఉద్యోగావకాశాలు లభించే ఈ టవర్ ఈ నెల 30న ఐటీ, మున్సిపల్ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారయింది. ఈ సందర్భంగా ఐటీటవర్ ప్రాంగణంలో పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ నేతృత్వంలో భారీ బహిరంగసభ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కరీంనగర్ ఐటీ టవర్ తమ కార్యకలాపాలు ప్రారంభించడానికి ఇప్పటికే 14 కంపెనీలు ముందుకొచ్చాయని మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్‌ తెలిపారు. టవర్ ప్రారంభం నాటికే యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తాయని చెప్పారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: