కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ చట్టం ఎన్ఆర్సి పై దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని రద్దు చేయాలంటూ దేశంలో ఉవ్వేఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పలుచోట్ల నిరసనలు ఉగ్ర రూపం కూడా దాలుస్తున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా సినీ రాజకీయ ప్రముఖులు నిరసనలు తెలుపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆందోళనల కారణంగా దేశంలో పలు ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. పలు చోట్ల ఆందోళనకారులు రెచ్చిపోయి మరి ప్రభుత్వ ఆస్తులను సైతం ధ్వంసం చేస్తున్నారు. అయితే నిరసన  చేస్తూ విధ్వంసం సృష్టిస్తున్న నిరసనకారుల అరెస్టుల పర్వం కూడా కొనసాగుతుంది. 

 

 

 

 ఇకపోతే కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని తమ రాష్ట్ర పరిధిలో అమలు చేయబోమని అంటూ తేల్చి చెప్పారు. అంతేకాకుండా గతంలో బిజెపి కి వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ కూడా పౌరసత్వ సవరణ చట్టం పై వ్యతిరేకత వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం పౌరసత్వ సవరణ చట్టాన్ని తమ రాష్ట్ర పరిధిలో అమలు చేయబోమని తేల్చి చెప్పారు. అంతేకాకుండా పౌరసత్వ సవరణ చట్టం పై ఐక్యరాజ్యసమితి కి వెళ్తాము  అంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. అయితే మమతా బెనర్జీ వ్యాఖ్యలపై స్పందించిన మోదీ మండిపడ్డారు. ఢిల్లీలోని రామ్ లీల  మైదానంలో నిర్వహించిన సభలో మాట్లాడిన మోదీ మమతా బెనర్జీ తీరు పై నిప్పులు చెరిగారు. 

 

 

 

 గతంలో పార్లమెంటులో అక్రమ చొరబాటుదారులను చేయాలంటూ వ్యాఖ్యానించారు ప్రస్తుత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఇప్పుడు అలాంటి చట్టాన్నే తాము తీసుకొస్తే ఈ చట్టానికి వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి కి వెళ్తామని  అంటూ మాట మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం అక్రమ చొరబాటుదారుల విషయంలో మమతా బెనర్జీ తన వైఖరి మార్చుకున్నారని విమర్శించారు. వచ్చే ఏడాదిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే మమత మాట మార్చారని ఆరోపించారు ప్రధాని మోదీ. దీదీ మీకు  ఏమైంది..  ఎందుకు మీ వైఖరి మార్చుకున్నారు ఎందుకు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారు అంటూ ప్రశ్నించారు ప్రధాని మోదీ. బెంగాల్ ప్రజల పై మీకు నమ్మకం లేదా అంటూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని సూటిగా ప్రశ్నించారు ప్రధాని మోదీ.

మరింత సమాచారం తెలుసుకోండి: