మోడీ అమిత్ షా ద్వయంలో  దేశంలో 70  శాతంకు పైగా రాష్ట్రాల్లో బీజేపీ  జెండా ఎగురవేసి కంచుకోట నిర్మించుకున్న విషయం తెలిసిందే. కానీ గత కొంతకాలంగా బీజేపీ  కంచుకోట కూలిపోతున్నట్లు కనిపిస్తోంది. బీజేపీ వైపు ప్రజలు ఆసక్తి చెబుతున్నప్పటికీ పూర్తి స్థాయిలో మాత్రం మెజారిటీని కట్టబెట్టడం లేదు. తాజాగా ఝార్ఖండ్  ఎన్నికల్లో కూడా ఇదే జరుగుతోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా జార్ఖండ్లో మొత్తం అయిదు దశల్లో పోలింగ్ జరిగింది. 65.7 శాతం పోలింగ్ జరిగింది. ఇకపోతే మొన్న జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో గానే... ఝార్ఖండ్  ఎన్నికల్లో కూడా ప్రజలు ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ మాత్రం కట్టబెట్టలేదు. ఈరోజు ఉదయం నుంచి కౌంటింగ్ ప్రారంభమైంది.

 

 

 

 కాగా మరికొన్ని గంటల్లో అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. బిజెపి జేఎంఎం నువ్వానేనా అన్నట్లు గా ఎన్నికల ఫలితాల్లో ముందుకు సాగుతున్నాయి. అయితే ఎన్నికల ఫలితాలు ఎస్టీ నియోజకవర్గాల్లో బిజెపికి చుక్కెదురయ్యేలా  కనిపిస్తోంది. కౌంటింగ్ మొదటి నుంచి  ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాల్లో  బిజెపి వెనుకంజలోనే  కొనసాగుతోంది. గత ఏడాది ప్రభుత్వం చోట నాగపూర్ టెనెన్సీ  చట్టం సవరించడం... సంతాల్ పారగాన టెనెన్సీ  చట్టాన్ని సవరించాడాన్ని  ఇక్కడి గిరిజనులు జీర్ణించుకోలేక పోయినట్లు తెలుస్తోంది. అందుకే ఇక్కడి ఓటర్లు అందరూ బీజేపీ పై అంతగా ఆసక్తి చూపనట్లు కనిపిస్తోంది. అంతేకాకుండా ఇక్కడికి ప్రాంతంలో ప్రజల్లో బిజెపి ప్రభుత్వం పై తీవ్రమైన వ్యతిరేకత ఉన్నట్లు సమాచారం.

 

 

 

 ఇకపోతే  గతంలో ఒక ఎన్నికలో  ఇక్కడ గెలిచే స్థానాలు నిలబెట్టుకున్న అభ్యర్థులు మరోసారి తమ స్థానాలను నిలబెట్టుకోవడంలో మాత్రం విఫలమవుతున్నారు. 33 అసెంబ్లీ  స్థానాలు 17 స్థానాల్లో సిట్టింగ్ అభ్యర్థులు  మాత్రం ఎప్పుడూ గెలిచిన దాఖలాలు లేవు . అదే ఇప్పుడు కాంగ్రెస్ కూటమికి కలిసొచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే 17 స్థానాల్లో  8 స్థానాలు ఎస్టీ రిజర్వుడ్  కావడం గమనార్హం. మొత్తానికి అయితే ఎస్టీ రిజర్వుడు స్థానాల్లో  బిజెపికి ఎదురు దెబ్బ తగిలేల  కనిపిస్తోంది. ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గ అన్ని స్థానాల్లో  కాంగ్రెస్ కూటమి లో ముందంజలో ఉన్నట్లు  స్పష్టంగా తెలుస్తోంది. ఇకపోతే అటు బీజేపీ పార్టీ కూడా మ్యాజిక్ ఫిగర్ కు చాలా దూరంలోనే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: