కొద్దిమందితో 18 ఏండ్ల క్రితం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు తిరుగులేని రాజకీయశక్తిగా ఎదిగింది. కాని దీని వెనుకున్న శ్రమ అంతా యింతా కాదు. తన 47ఏండ్ల వయస్సులో కేసీఆర్ పార్టీని ఏర్పాటుచేశారు. ఆ సమయంలో రాజకీయ నాయకులు తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ నినాదాన్ని వారి స్వార్థ ప్రయోజనాలకే వాడుకుంటారనే అపనమ్మకాలు, అనుమానాలున్నాయి.

 

 

కేసీఆర్ ఆనాడు ఒకరకంగా దుస్సాహసమే చేశారు. రాజకీయ పోరాటాలతోనే తెలంగాణ ఏర్పడి తీరుతుందని బలంగా విశ్వసించిన కేసీఆర్.. మూడు పదవులకు రాజీనామాచేశారు. ఉద్యమాన్ని వదిలిపెడితే, పక్కదారిపడితే రాళ్లతో కొట్టి చంపే అధికారాన్ని మీకు ఇస్తున్నానంటూ ప్రజల్లో విశ్వాసం నింపారు. ఇకపోతే ప్రజలను కదిలించి చరిత్ర సృష్టించిన నేతలు ఇద్దరే. ఒకరు ఎన్టీఆర్. రెండు కేసీఆర్. అయితే ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం చేసేనాటికే దశాబ్దాల సినీఅనుభవంతో సాధించిన క్రేజ్ ఉంది. వెన్నుదన్నుగా అతిపెద్ద ఆర్థిక లాబీ ఉంది.

 

 

సామాజిక బలం ఉంది. మీడియా స్వయంగా మోసింది. ఇన్ని అనుకూలతల మధ్య ఎన్టీఆర్ పయనం సాగింది. కేసీఆర్ దీనికి పూర్తిగా భిన్నం. ఉద్యమం ప్రారంభించే నాటికి రాజకీయ వారసత్వం లేదు. వెన్నుదన్నుగా లాబీలు లేవు. సామాజిక బలం దాదాపు శూన్యం. పైగా మీడియా మద్దతుకు బదులు కత్తిగట్టి ఉంది. తెలుగు ఆత్మగౌరవం పేరుతో ఎన్టీఆర్ ఉద్యమం ఢిల్లీవరకే వెళ్లింది. తెలంగాణ ఆత్మగౌరవం సాంస్కృతిక పునరుజ్జీవమై లండన్‌లోని థేమ్స్‌నది అలల మీద బతుకమ్మ తెలంగాణ ఆత్మగౌరవాన్ని అంతర్జాతీయంగా చాటి చెప్పింది.

 

 

ఇక తెలంగాణ సాధనలో ఎన్నో జీవితాలు గాల్లోకలసిపోయాయి. అటువంటి సమయంలో ఢిల్లీలోని పెద్దలను ధైర్యంగా ఎదిరించి సోనియా గాంధీని మెప్పించి తెలంగాణా రాష్ట్రాన్ని సాధించాడు. ఈ పోరాటంలో తన ప్రాణాలను కూడా లెక్కచేయని మొండిఘటమని పేరుతెచ్చుకుని  ఎట్టకేలకు కేసీఆర్ తిరుగులేని విజ‌యాన్ని సొంతం చేసుకున్నాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: