పల్లె ప్రగతిలో భాగంగా ఇచ్చిన మాట ప్రకారం ప్రతినెలా 339 కోట్ల రూపాయలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం విడుదల చేస్తున్నదని చెప్పారు. పల్లెను అభివృద్ధిపథంలో నడిపించే దిశగా జిల్లాల కలెక్టర్లను నిరంతరం అప్రమత్తంచేస్తూ తగిన సూచనలిస్తున్నామని, పంచాయతీరాజ్ చట్టంలో కూడా కలెక్టర్లకు ఆ మేరకు అధికారాలను దఖలుపరిచామని సీఎం తెలిపారు. పచ్చదనం పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు గ్రామస్థాయిలో పని వ్యవస్థలను కూడా పటిష్ఠం చేశామన్నారు. గ్రామోద్యోగుల జీతాలు కూడా పెంచినామని చెప్పారు. గ్రామాల్లో స్వచ్ఛతపై ప్రజలు చూపిస్తున్నంత ఉత్సాహాన్ని అధికారులు ప్రజాప్రతినిధులు చూపించడం లేదనే ఫిర్యాదులు, సూచనలు తనకు క్షేత్రస్థాయి నుంచి అందుతున్నాయని.. అందుకే వందశాతం ఫలితాలను రాబట్టడానికి తనిఖీలు నిర్వహించి.. దిద్దుబాటు చర్యలు చేపడతామని సీఎం తెలిపారు.
పల్లె ప్రగతిలో స్థానికులు భాగస్వామ్యం పంచుకోవడం శుభపరిణామమని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం సత్ఫలితాలను ఇవ్వడం సంతోషకరమని చెప్పారు.  పరిస్థితులను బట్టి పల్లె ప్రగతి కార్యక్రమ పురోగతిని తనిఖీ చేస్తామని కార్యక్రమం ప్రారంభంలోనే చెప్పినట్టు గుర్తుచేశారు. ఇందులో భాగంగా ఫ్ల్లయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటుచేసి పనితీరు మెరుగుపరుచుకోని అధికారులు, ప్రజా ప్రతినిధులపై చర్యలు తీసుకుంటామని సీఎం స్పష్టంచేశారు. ఇది ఎవరినీ ఇబ్బంది పెట్టడానికి కాదు, ఫ్ల్లయింగ్ స్క్వాడ్స్ తనిఖీలు నిర్వహించి నివేదికలు తయారుచేసి ప్రభుత్వానికి అందచేయడానికి మాత్రమే’ అని సీఎం కేసీఆర్ వివరించారు.

పల్లె ప్రగతి కార్యక్రమాల పనితీరును పరిశీలించేందుకు జనవరి ఒకటో తేదీ నుంచి ఫ్ల్లయింగ్ స్క్వాడ్స్ నియమిస్తున్నామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు వెల్లడించారు. స్వచ్ఛతకు అద్దం పట్టేలా పచ్చనైన పరిశుభ్రమైన పల్లెల కోసం సెప్టెంబర్ మొదటివారం నుంచి 30 రోజులపాటు నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమం జనాదరణ పొందిందన్నారు. ఈ ఫ్ల్లయింగ్ స్క్వాడ్స్ రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్ల్లో చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమాల పురోగతిని వాటి నాణ్యతను తనిఖీచేసి ప్రభుత్వానికి నివేదికలు అందిస్తాయని తెలిపారు. పల్లె ప్రగతి కార్యక్రమ పురోగతిపై ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ  పల్లె ప్రగతి కార్యక్రమం గురించి ప్రభుత్వం సీరియస్ వివరించిన ముఖ్యమంత్రి... ‘అత్యవసర పనిమీద బెంగళూరు వెళ్లవలసిన పంచాయతీరాజ్ కమిషనర్ రఘునందన్ ప్రయాణాన్ని వాయిదావేయించి మరీ సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నం.. అంటే అర్థం చేసుకోవాలె’ అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: