నరేంద్రమోడి పరిపాలన మసకబారుతోందా ? తాజాగా ఝార్ఖండ్ ఎన్నికల ఫలితాల తర్వాత అందరికీ అనునాములు మొదలయ్యాయి. మొదటి ఐదేళ్ళ పరిపాలనలోనే నిజానికి మోడి అద్భుతాలేమీ చేయలేదు. పైగా నోట్లరద్దు, జిఎస్టి లాంటి నిర్ణయాలతో యావత్ దేశాన్ని ఇబ్బందుల్లోకి నెట్టారనే చెప్పాలి. అయినా కానీ అదే సమయంలో జరిగిన కొన్ని రాష్ట్రాల ఎన్నికల్లో ఘనవిజయాలు సాధించారు.

 

సరే అదంతా చరిత్రగా చెప్పుకుంటే రెండోసారి ప్రధాని అయిన తర్వాత జరిగిన మధ్యప్రదేశ్, రాజస్ధాన్ లాంటి రాష్ట్రాల్లో బిజెపి ఓడిపోయిన విషయం అందరికీ తెలిసిందే.  ఇక తాజాగా జరిగిన ఝార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో  కమలంపార్టీకి తల బొప్పికట్టినట్లే అని చెప్పాలి. 81 స్ధానాల అసెంబ్లీలో కాంగ్రెస్, ఝార్ఖండ్ ముక్తిమోర్చా (జెఎంఎం)కూటమి అఖండ విజయం సాధించటమే ఆశ్చర్యంగా ఉంది.

 

బిజెపి పాలనలో పెరిగిపోయిన అవినీతి, అరాచకాలతో  మళ్ళీ అధికారంలోకి రావటం కష్టమనే ప్రచారమైతే జరిగింది. కానీ  కేంద్రంలో అధికారంలో ఉండటం బిజెపికి కలిసి వచ్చే అంశం కాబట్టి ఫలితాల్లో చివరకు ఏమవుతుందో అన్న అనుమానం ఉండనే ఉంది. అయితే ఈరోజు వెల్లడైన ఫలితాలు చూసిన తర్వాత మోడి, అమిత్ షా ల చాణుక్యం పారలేదని అర్ధమైపోయింది.

 

తాజా ఫలితాల ప్రకారం 81 సీట్ల అసెంబ్లీలో కాంగ్రెస్ కూటమి 45 సీట్లలో మెజారిటి దాటిపోయింది. అదే సమయంలో బిజెపి మెజారిటి కేవలం 16 సీట్లలో మాత్రమే కనబడుతోంది. జెవిఎం మూడు సీట్లలోను, ఇతరులు నాలుగు సీట్లలోను ముందంజలో ఉన్నారు.  అయితే మెజారిటీలు రౌండు రౌండుకు మారుతున్న విషయాన్ని కూడా అందరూ గుర్తుంచుకోవాలి.

 

ఇప్పటి వరకూ సుమారు ఏడు రౌండ్ల ఫలితాలు వెలువడిన సరళిని చూస్తే అభ్యర్ధుల మధ్య తేడా కేవలం వందల ఓట్లే ఉన్నాయి.  ఈ పద్దతి చాలా నియోజకవర్గాల్లో కంటిన్యు అవుతోంది. కాబట్టి అంతిమ విజయం ఎవరిని వరిస్తుందనే విషయంలో అందరిలోను ఉత్కంఠ పెంచేస్తోంది.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: