1969 నుంచి ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం జరుగుతుంది.  అప్పటి నుంచి 2014 వరకు విజయవంతంగా పోరాటం చేశారు.  2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు.  తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ తరువాత తెలంగాణలో అడ్రస్ లేకుండా పోయింది.  బలమైన నాయకత్వం లేకపోవడం వలనే ఆ పార్టీ ఇబ్బందులు పడుతున్నది.  ఇప్పటికే అలాంటి ఇబ్బందులే పడుతున్నది.  పార్టీ కోలుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు.

 
ఎన్ని ఇబ్బందులు వస్తున్నా,  పార్టీ మనుగడ సాగించేందుకు మాత్రమే ప్రయత్నం చేస్తున్నది.  అంతకు మించి పెద్దగా చేయలేకపోతున్నది. 2014లో జరిగిన ఎన్నికల్లో తెరాస పార్టీ మంచి విజయం సాధించింది.  అయితే, అప్పటికే రెండు రాష్ట్రలు విడిపోవడంతో... తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఇబ్బందులు మొదలయ్యాయి.  తెలుగుదేశం పార్టీ నుంచి ముఖ్యనేతలంతా తెరాస లో చేరిపోయారు.  అటు కాంగ్రెస్ నుంచి కూడా నేతలు తెరాస లోకి జంప్ అయ్యారు.  


దీంతో తెరాస పార్టీ బలం మరింతగా పెరిగింది.  మొదటిసారి ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయ్యిన తరువాత కెసిఆర్ నీటిపారుదలపై దృష్టిపెట్టారు.  ఇందంతా బాగుంది.. అయితే, అన్ని ప్రాంతీయ పార్టీల మాదిరిగానే కెసిఆర్ ఇంటి పార్టీగా తెరాస పార్టీని మలుచుకున్నారు.  తెరాస పార్టీలో హరీష్ రావు, కవిత, కేటీఆర్ లను తీసుకున్నారు.  ప్రస్తుతం హరీష్ రావు, కేటీఆర్ లు ప్రభుత్వంలో మంత్రులుగా చేస్తున్నారు.  అయితే, కవిత గత ఎన్నికల్లో విజయం సాధించలేకపోయిన సంగతి తెలిసిందే.  


కాగా, ఆమెను ఇప్పుడు రాజ్యసభకు పంపే ప్రయత్నం చేస్తున్నారు.  కేటీఆర్ కు మంత్రిపదవితో పాటుగా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని కూడా అప్పగించారు.  వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే కెసిఆర్ తరువాత తెరాస పార్టీని లీడ్ చేయాల్సిన వ్యక్తిగా స్థానం అప్పగించినట్టే.  తరువాత తెరాస పార్టీకి కేటీఆర్ అధినేత అనే విషయం ఇప్పటికే అర్ధం అయ్యింది.  ప్రస్తుతం కేటీఆర్ కు గతంలో అప్పగించిన ఐటి, పరిశ్రమల శాఖను అప్పగించారు.  


హరీష్ రావుకు ఆర్థికశాఖ మంత్రిగా పదవిని అప్పగించారు.  కెసిఆర్ కుటుంబంలో కెసిఆర్ ముఖ్యమంత్రి, కేటీఆర్ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి, హరీష్ రావు ఆర్ధిక శాఖామంత్రిగా ఉన్నారు.  కుటుంబంలో ముగ్గురికి కీలక పదవులు ఉన్నాయి.  ఇక భవిష్యత్తులో కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయాలన్నది కెసిఆర్ కల.  అదికూడా త్వరలోనే సాధ్యం కావొచ్చు.  వచ్చే ఎన్నికల నాటికి కేటీఆర్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా కెసిఆర్ ప్రకటించే అవకాశం ఉన్నది.  కేటీఆర్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే మాస్ లో మంచి పలుకుబడి ఉన్న హరీష్ రావు సైలెంట్ గా ఉంటాడా...? చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: