మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బిజెపి నేత శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రధాని నరేంద్ర మోదీ పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఆదివారం రోజు ప్రధాన నరేంద్ర మోదీని సాక్షాత్తు దేవుడితో పోల్చాడు. దారుణంగా వివక్షకు గురైన ముస్లిమేతరులకు పౌరసత్వాన్ని కల్పించేందుకు మోదీ తీసుకున్న నిర్ణయానికి సలాం కొడుతూ శివరాజ్ సింగ్ చౌహాన్ నరేంద్ర మోదీని ఎంతో కొనియాడారు.

ఇండోర్ లో సింధి, పంజాబీ వర్గాల బిజెపి పార్టీ నేతలు నిర్వహించిన సమావేశంలో.. శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ.. ' దేవుడు మీకు ప్రాణాలను ఇస్తే, తల్లి మీకు జన్మనిచ్చింది.. కానీ నరేంద్ర మోడీ మీకు కొత్త జీవితాన్ని ఇచ్చి, ఆత్మగౌరవంతో కూడిన గౌరవాన్ని ప్రసాదించి తలెత్తుకునేలా చేశారు. నరేంద్ర మోదీ దేవుడి కంటే ఏ మాత్రం తక్కువ కాదు. అది అక్షరాల నిజం.' అని మోదీని ఆకాశానికెత్తారు. శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతున్న సమయంలో అక్కడి వేదికపై బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా కూడా ఉన్నారు.

ఇకపోతే, పాకిస్థాన్ లో ఉన్నటువంటి ముస్లిమేతర మహిళలను, చిన్నపిల్లలను పాకిస్తాన్ ప్రజలు గుళ్ళలోకి వెళ్లనివ్వకుండా చేస్తున్నారని... వారిపై మానభంగాలు చేస్తున్నారని, ఇంకా నిఖా పెళ్లిళ్లు చేస్తున్నారని అందుకే అక్కడి వారు భారతదేశానికి వలస వస్తున్నారని తేల్చి చెప్పారు. అయితే వారు భారతదేశంలో తలదాచుకునేందుకు తీసుకున్న వీసా గడువు తీరిపోవడంతో భారతదేశం వారిని వెనక్కి పంపిచేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ పౌరసత్వ సవరణ బిల్లు ద్వారా చిత్రహింసలు పడిలేక వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు భారత పౌరసత్వం ఇచ్చేందుకు మోదీ వేస్తున్న ముందడుగులను మెచ్చుకున్నారు శివరాజ్ సింగ్ చౌహాన్. పౌరసత్వ బిల్లు చట్టాన్ని కొంత మంది భారతీయ ప్రజలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అర్థం కాని స్థితిలో ఉన్నానని తెలిపాడు. మోదీకి ఇంత ముందు వ్యతిరేకంగా ఉన్న శివరాజ్ సింగ్ చౌహాన్ తాజాగాా మోదీని కొనియాడంతో చర్చనీయాంశం అయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: