అగ్ర‌రాజ్యం అమెరికా వ్య‌వ‌హారం ఇద్ద‌రు భార‌తీయుల మ‌ధ్య చీలిక‌కు కార‌ణ‌మైంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా భార‌తీయులంద‌రికీ ఆ ఇద్ద‌రూ సుప‌రిచితులే కాగా...ఇటు భార‌త ప్ర‌భుత్వం నిర్ణ‌యం అటు..అమెరికా ప్ర‌భుత్వ వ్య‌వ‌హార‌శైలి నేప‌థ్యంలో ఈ ఇద్ద‌రు రాజ‌కీయ‌వేత్త‌ల మ‌ధ్య స్ప‌ష్ట‌మైన అభిప్రాయా బేధాలు పొడ‌చూపాయి. అది కాస్త అమెరికా-భార‌త్ సంబంధాల‌ను ప్ర‌భావితం చేసే వ‌ర‌కూ చేరింది. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే అధికరణ 370 రద్దు తర్వాత అక్కడ విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని పేర్కొంటూ కాంగ్రెగేషనల్‌ కమిటీ ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. అయితే, ఈ తీర్మానంపై కమిటీతో సమావేశమయ్యేందుకు భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌ నిరాకరించారు. ఇందులో పార్లమెంటు సభ్యురాలు, భారతీయ అమెరికన్‌ ప్రమీలా జయపాల్ ఉండ‌ట‌మే కార‌ణ‌మ‌ని ఆయ‌న పేర్కొన్నారు.దానికి ప్ర‌మీలా సైతం కౌంట‌ర్ ఇచ్చారు. 

 

వివ‌రాల్లోకి వెళితే...కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే అధికరణ 370 రద్దు తర్వాత అక్కడ విధించిన ఆంక్షల విష‌యంలో అమెరికా జోక్యం చేసుకుంది. ఇందులో అమెరికా చ‌ర్య‌ల‌ను ప్ర‌తిబింబించేలా ప్ర‌మీలా మాట్లాడ‌టంతో భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ ఆ క‌మిటీ స‌మావేశ‌మైంది.  ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టిన ఈ తీర్మానం జమ్ముకశ్మీర్‌ వాస్తవ పరిస్థితిని ప్రతిబింబించడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. చర్చలు జరపాలనుకున్న వారిని కలిసేందుకు తనకు ఎలాంటి అభ్యంతరమూ లేదని, కాకపోతే ముందుగానే అభిప్రాయాలు ఏర్పరచుకున్న వారితో(ప్రమీలా జయపాల్‌తో) మాత్రం కాదని ఆయన స్పష్టం చేశారు. 

 


కాగా, త‌నతో భేటీని జైశంకర్‌ రద్దు చేసుకోవడంపై ప్రమీలా జయపాల్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భిన్నాభిప్రాయాలను వినడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా లేదన్న విషయం దీంతో రుజువైందని ఆమె ట్వీట్‌ చేశారు. దీంతో సెనెటర్లు బెర్నీ శాండర్స్‌, ఎలిజిబెత్‌ వారెన్‌తో పాటు మరో ఇద్దరు సెనెటర్లు జయపాల్‌కు బాసటగా నిలిచారు. ప్రమీలా జయపాల్‌తో జైశంకర్‌ సమావేశం కాకపోవడంపట్ల తీవ్ర అభ్యంతరం ప్రకటించారు. కశ్మీరీలు, ముస్లింలకు అనుకూలంగా ఆమె మాట్లాడినంత మాత్రాన ఆయన ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో తెలియడంలేదన్నారు.

 

కాగా, డెమోక్రాటిక్‌ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉన్న సెనెటర్లు బెర్నీ శాండర్స్‌, ఎలిజిబెత్‌ వారెన్‌తో పాటు మరో ఇద్దరు సెనెటర్లు భారతీయ అమెరికన్‌ పార్లమెంటు సభ్యురాలు ప్రమీలా జయపాల్‌కు మద్దతుగా నిలిచారు.  ప్రమీలా జయపాల్‌తో జైశంకర్‌ సమావేశం కాకపోవడంపట్ల తీవ్ర అభ్యంతరం ప్రకటించారు. కశ్మీరీలు, ముస్లింలకు అనుకూలంగా ఆమె మాట్లాడినంత మాత్రాన ఆయన ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో తెలియడంలేదన్నారు. ప్రమీలా జయపాల్‌ నోరు నొక్కడానికి జరుగుతున్న యత్నాలను వారు ఖండించారు. భారత-అమెరికా దేశాల మధ్య చక్కని భాగస్వామ్యం ఉన్నదని, మంచి వాతావరణంలో జరిగే చర్చలు ఈ భాగస్వా మ్యాన్ని మరింత బలోపేతం చేస్తాయని వాళ్లు పేర్కొన్నారు. ‘మానవహక్కుల పరిరక్షణకు బాసటగా నిలిచే అమెరికా సెనెటర్ల గొంతుకను నియంతృత్వ అధికార ప్రభుత్వం నొక్కివేయొచ్చు గానీ, భారత ప్రభుత్వం ఈ చర్యలకు పాల్పడుతుందని అనుకోలేదు. కశ్మీరీలు, ముస్లింలపై విధించిన ఆంక్షలపై జయపాల్‌ పేర్కొన్న అంశాలన్నీ సరైనవే’ అని శాండర్స్‌ ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. ‘భారత్‌, అమెరికా మధ్య అతి ముఖ్యమైన భాగస్వామ్యం ఉన్నది. అయితే, ప్రజాస్వామ్యం, మానవహక్కులు, వివిధ మతాల పట్ల గౌరవం ఉన్నప్పుడే ఈ భాగస్వామ్యం ఫలప్రదం అవుతుంది’ అని మరో సెనెటర్‌ వారెన్‌ ట్వీట్‌ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: