ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తరువాత తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ హవా రోజురోజుకు పెరుగుతోందే తప్ప తగ్గటం లేదు. కేసీఆర్ తనను నమ్మిన వాళ్లను ఎప్పుడూ అందలం ఎక్కిస్తారు. తనను, పార్టీని నమ్ముకొని పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారికి కీలకమైన పదవులు ఇచ్చి కేసీఆర్ వారికి తగిన గుర్తింపును ఇస్తారు. కేసీఆర్ కు మిత్రుడు అయిన తుమ్మల నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 
 
ఓటమి బాధలో ఉన్న తుమ్మల నాగేశ్వరరావుకు కేసీఆర్ టీఆర్ ఎస్ పార్టీలోకి ఆహ్వానించటంతో పాటు తుమ్మల నాగేశ్వరరావును ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి కూడా ఇచ్చారు. కేసీఆర్ తనను నమ్ముకుని పార్టీలో చేరిన పోచారం శ్రీనివాస్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ లకు కీలక పదవులను ఇచ్చారు. తొలి కేబినేట్ లోనే కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి మంత్రి పదవిని వదులుకొని వచ్చిన జూపల్లి కృష్ణారావుకు మంత్రిపదవి ఇచ్చారు. 
 
తొలినాళ్లనుండి తనతో పాటే ఉండటంతో పాటు ఎన్నో త్యాగాలను చేసిన మధుసూదనాచారికి తెలంగాణ తొలి స్పీకర్ గా చేశారు. టీఆర్ ఎస్ పార్టీ పెట్టినప్పటి నుండి కేసీఆర్ తో పాటే ఉన్న నరసింహారెడ్డిని కేసీఆర్ తొలి తెలంగాణ హోం మంత్రిని చేశారు. తెలంగాణ ఉద్యమం కొరకు ప్రాణాలను అర్పించిన అమరవీరుడు శ్రీకాంత్ చారి తల్లికి గతంలో కేసీఆర్ హుజూర్ నగర్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. 
 
విద్యార్థి నాయకుడు అయిన బాల్క సుమన్ ను పెద్దపల్లి ఎంపీ సీటు ఇచ్చి గెలిపించారు. ఆ తరువాత చెన్నూరు ఎమ్మెల్యే సీటు ఇచ్చి గెలిపించారు. అద్దంకి దయాకర్ కు రెండు సార్లు సీట్లు ఇవ్వగా ఆయన తుంగతుర్తి ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలిచారు. ఇలా కేసీఆర్ ను నమ్ముకున్న వారందరికీ కేసీఆర్ కీలకమైన పదవులు ఇచ్చి వారిని అందలం ఎక్కించి తగిన గుర్తింపును ఇచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: