అమరావతిని నామమాత్రపు రాజధానిగా ప్రకటించి కార్యనిర్వాహక రాజధానిగా విశాఖను తెరపైకి తీసుకురావడంతో అమరావతి ప్రాంతం ఒక్కసారిగా భగ్గుమంటోంది. రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల ప్రజలు రోడ్డుపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు.  పిల్లలు, పెద్దలు, రైతులు అందరూ రోడ్డుమీదకు వచ్చి నినాదాలు చేస్తున్నారు.  రోడ్డుపైనే వంటావార్పు కార్యక్రమాలు వంటివి చేస్తూ రచ్చరచ్చ చేస్తున్నారు.  
ముఖ్యంగా తుళ్లూరు నుంచి మిగతా అన్ని గ్రామాల ప్రజలు రద్దుపై ధర్నాలు, నినాదాలు చేస్తుండటంతో రాజధాని ప్రాంతం రణరంగంగా మారిపోయింది.  అమరావతి నుంచి రాజధానిని తరలించేందుకు వీలులేదని, రాజధాని అమరావతి ఉండి తీరాల్సిందే అంటున్నారు.  రాజధాని అమరావతిని ఉంచుతామని, అమరావతిలో అసెంబ్లీ, మంత్రులు, హైకోర్టు బెంచ్ ఉంటుంది.  


దేనికోసం కొద్దీ భూమి మాత్రమే సరిపోతుంది.  అయితే, జీఎన్ రావు కమిటీ నివేదిక ప్రకారం మూడు ప్రాంతాల్లో అసెంబ్లీ ఉండాలని అంటున్నారు.  అమరావతిలో వర్షాకాల సమావేశాలు, కర్నూలులో శీతాకాల సమావేశాలు.. విశాఖలో సమ్మర్ సమావేశాలు నిర్వహించాలని అంటున్నారు.సో, అమరావతిలో ఎప్పుడో ఒక్కసారి మాత్రమే అసెంబ్లీ ఉపయోగపడుతుంది.  మంత్రులు అమరావతిలో ఉండాలని చెప్పినా కార్యనిర్వాహక రాజధాని విశాఖ కాబట్టి అందరూ అక్కడికే వెళ్ళిపోతారు.   అందులో సమస్య లేదు.   మరి అలాంటప్పుడు అమరావతి వలన ఉపయోగం ఏముంటుంది.  ఎప్పటిలాగే ఎలాంటి అభివృద్ధి లేకుండా ఉంటుంది.

 గతంలో అక్కడ మూడు రకాల పంటలు పండేవి.  ఇప్పుడు భూమి పంటలు పండించేందుకు కూడా అనుకూలంగా లేదు.  దాదాపుగా అన్ని ప్లాట్స్ వేశారు.  రాజధాని అమరావతిలోని ఉంటుందని చెప్పి చాలామంది భూములు కూడా కొనుగోలు చేశారు.  ఇప్పుడు వీరి పరిస్థితి అగమ్యగోచరం అని చెప్పాలి.  
అందుకే ప్రజలు ధర్నాలు, నిరసనలు చేస్తున్నారు. రాజధానిని తరలించేందుకు ససేమిరా అంటున్నారు.

 అయితే, ఈనెల 27 వ తేదీన జరిగే మంత్రివర్గ సమావేశంలో రాజధాని గురించిన విషయాలు పూర్తిగా తేలిపోతుంది.  విశాఖలో కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటు చేస్తారా లేదా అన్నది.  ఇప్పటికే విజయసాయి రెడ్డి ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు.  భీమిలి రాజధాని ప్రాంతంగా మారబోతున్నట్టు ప్రకటించారు.  విజయసాయి రెడ్డి చెప్పారు అంటే జగన్ ఆలోచనను చెప్పినట్టే కదా. ఇక ఆ మాట అధికారికంగా మాత్రమే వెలువడాల్సి ఉన్నది. 

మరింత సమాచారం తెలుసుకోండి: