సంచలన నిర్ణయాలు సాహసోపేత అడుగులు... మొదటి నుంచి కేసీఆర్ ఇదే వైఖరితో ముందుకు సాగారు. తెలంగాణ ఉద్యమంలోనూ ఇదే వైఖరి ప్రదర్శించారు కేసీఆర్. ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ.. తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించారు. ఈ ఉద్యమంలో తెలంగాణ ప్రజానీకం కేసీఆర్ అడుగులో అడుగు వేసి ముందుకు సాగింది . తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత అధికారాన్ని చేపట్టిన టిఆర్ఎస్ పార్టీ ... ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటు, వినూత్న  పథకాలు ప్రవేశ పెడుతూ ముందుకు సాగింది. అయితే ఆనాటి తెలంగాణా ఉద్యమం నుంచి నేడు రెండోసారి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి  సాగిస్తున్న పాలన వరకు... సంచలన నిర్ణయాలు తీసుకుంటూ సాహసోపేత అడుగులు వేస్తూ ముందుకు సాగారు ముఖ్యమంత్రి కేసీఆర్. 

 


 తెలంగాణ ప్రజలందరికీ అప్పటి వరకు అందిన పాలన ఒకెత్తయితే  తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కెసిఆర్ ప్రభుత్వ హయాంలో అందిన పాలన ఒకెత్తు . తన ప్రభుత్వ హయాంలో పాలనకే  పాలన నెర్పి ప్రజలందరికీ సుపరిపాలన అంటే ఎలా ఉంటుందో అని నిరూపించారు ముఖ్యమంత్రి కేసీఆర్. 2014లో అధికారాన్ని చేపట్టిన తర్వాత... పేద ప్రజల అభ్యున్నతికి పాటు పడ్డారు ఆయన. తెలంగాణ సెంటిమెంట్ తోనే అధికారం లోకి వచ్చావ్ అంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తుంటే... మరో సాహోసోపేత నిర్ణయం  తీసుకొని ముందస్తు ఎన్నికలకు వెళ్ళాడు కేసీఆర్. ముందస్తు ఎన్నికలకు వెళ్లినప్పటికీ ప్రజలు మరోసారి టిఆర్ఎస్ పార్టీ కి భారీ మెజారిటీ కట్టబెట్టారు. 

 


 2018లో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కేసీఆర్... టిఆర్ఎస్ లో ఎంతోమంది సీనియర్ నేతలు ఉన్నప్పటికీ.. గులాబీ పార్టీకి తన తర్వాత అధినేత కేటీఆర్ అంటూ చాటిచెబుతూ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కేటీఆర్ కు  కట్టబెట్టారు కేసీఆర్. కెసిఆర్ నిర్ణయం తర్వాత గులాబీ నేతల్లో  అసంతృప్తి ఏర్పడుతుందని అందరూ అనుకున్నారు కానీ కేసీఆర్  నిర్ణయం ఫైనల్ గా మారిపోయింది. మొన్నటికి మొన్న ప్రతిపక్షాలు కార్మికులందరినీ రెచ్చగొట్టి ఆర్టీసీ సమ్మెకు సైరన్ మోగించాయి. 50 రోజులు కొనసాగినప్పటికీ కేసీఆర్ మాత్రం తన మొండి పట్టు వీడలేదు చివరికి కార్మికులు దిగివచ్చి.. విధుల్లో  చేరితే వాళ్లకి వరాల జల్లు  కురిపించారు కేసీఆర్ . ఇలా గత దశాబ్ద కాలంగా ఎన్నో సంచలన నిర్ణయాలు సాహసోపేత అడుగులు వేస్తూ పాలనకే  పాలన నేర్పించారు ముఖ్యమంత్రి.

మరింత సమాచారం తెలుసుకోండి: