ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ తరువాత అభివృద్ధి చెందిన నగరం విశాఖ.  విశాఖ టూరిజం పరంగానే కాకుండా ఇండస్ట్రీరియల్ గా కూడా అభివృద్ధి సాధించింది.  విశాఖలో గాజువాక ఉక్కు కర్మాగారంలో పాటుగా నేవీ, నౌకానిర్మాణ  సంస్థలు, హిందూస్తాన్ షిప్ యార్డ్, ఇలా ఎన్నో కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి.  పైగా కారిడార్ ప్రాంతం కావడంతో ఇక్కడ అభివృద్ధి జరిగింది. ఇప్పుడు దీనిని ఆంధ్రప్రదేశ్ కార్యనిర్వాహక రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నది.  


అయితే, ఈ నగరం ఎంతవరకు సేఫ్ అనే విషయం ఇప్పుడు తెరపైకి వచ్చింది.  అమరావతిలో వరద ముప్పు ఉండే అవకాశం ఉన్నట్టుగా జిఎన్ రావు  కమిటీ పేర్కొన్న సంగతి తెలిసిందే.  ఇప్పుడు విశాఖకు కూడా ఉగ్రముప్పు ఉన్నట్టుగా తెలుస్తోంది.  1965 యుద్ధ సమయంలోనే పాక్ ఈ నగరంపై కన్నేసింది.  ఈ నగరాన్ని, నగరంలో ఉన్న నేవీ సంస్ధలను ధ్వంసం చేయాలని పాక్ ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే.  పీఎన్ఎస్ ఘాజీ వైజాగ్ ను లక్ష్యంగా చేసుకొని విధ్వంసం సృష్టించేందుకు పశ్చిమ తీరం దాటుకొని విశాఖకు చేరుకుంది.  


అయితే అప్రమత్తమైన నేవి సిబ్బంది ఘాజీని ధ్వంసం చేశారు.  విశాఖలో నౌకాదళానికి చెందిన అనేక వాహక నౌకలను, జలాంతర్గాములను తయారు చేస్తుంటారు.  శత్రువులను చీల్చి చెండాడే క్షిపణి వ్యవస్థ కలిగిన అణు జలాంతర్గాములు కూడా ఇక్కడే తయారు చేస్తున్నారు.  అయితే, దేశంలో పాక్ కు చెందిన కొందరు గూఢచారులు మనదేశ నావికాదళానికి చెందిన రహస్యాలను పాక్ చేరవేస్తున్నారనే సమాచారం రావడంతో ఇండియా అప్రమత్తం అయ్యింది.  


నావికాదళంలోనే ఉంటూ గూడాచార్యనికి పాల్పడుతున్న ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు.  పాక్ కు పశ్చిమ తీరంలో ఉన్న గుజరాత్, ముంబై, కొచ్చి తీరాలు దగ్గరగా ఉంటుంది.  కానీ, పాక్ వాటిని పక్కన పెట్టి తూర్పు తీరంపై కన్నెయ్యడం, గూఢచారులను నియమించి రహస్యాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడంతో విశాఖలోని నేవీ అప్రమత్తం అయ్యింది.  దీంతో మరోసారి విశాఖ తూర్పు తీరం వార్తల్లోకి వచ్చింది.  ఈ సమయంలో విశాఖలో ఆంధ్రప్రదేశ్ కార్యనిర్వాహక రాజధానిగా ఏర్పాటు చేయడం ఎంతవరకు సేఫ్ అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: