గత కొన్ని రోజులగా రాష్ట్రంలో చాలా  ఉల్లి సమస్య ఉంది. ఇక కొన్ని రోజులుగా ప్రజలను  ఊరిస్తున్న ఈజిప్టు ఉల్లి ఇప్పుడు జిల్లాకు వచ్చేసింది. ఈ మేరకు ఈజిప్టు నుంచి ఉల్లిపాయలతో బయలుదేరిన తొలి షిప్ ఇప్పటికే ముంబైకి రావడం జరిగింది. ఈజిప్టులో  శనివారం రాత్రి ఉల్లిపాయలు లోడు చేసుకున్న లారీలు రాష్ట్రానికి బయలు దేరడం జరిగింది. ఈ లోడ్ నేటికీ  విజయవాడకు  వస్తాయి అని  మార్కెటింగ్‌ శాఖ అధికారులు వల్ల భావన తెలియచేస్తున్నారు. 

 

ఇక మంగళవారం నుంచి విక్రయాలు మొదలు అవుతాయి అని అధికారులు  తెలియ చేస్తున్నారు. ఇక ప్రభుత్వం ఉల్లి కొరతను అధికమించే కోసం ఈజిప్టు నుంచి ఉల్లి దిగుమతి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్న సంగతి అందరికి తెలిసిందే కదా. ఈ ఉల్లిపాయలు లోడ్ ఈజిప్టు నుంచి ముంబై పోర్టుకు షిప్లో రావడం జరుగుతుంది.  ఇక  ముంబై నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు లారీల్లో తరలించడం జరుగుతుంది. జిల్లాకు మొదటి విడతలో 25 టన్నుల ఈజిప్టు ఉల్లిని కేటాయించడం జరిగింది. ఇక ఈ లోడ్లు నగరానికి రాగానే మంగళవారం నుంచి వీటిని రాయితీపై పంపిణీ చేయాలనీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. గత  కొన్నాళ్లుగా కర్నూలు, తాడేపల్లిగూడెం, హైదరాబాద్‌ల నుంచి దిగుమతి జరుగుతుండగా .. కొద్దిరోజుల క్రితం అవి కూడా నిలిచిపోవడంతో ప్రజలు చాల ఇబ్బందులు పడుతున్నారు.

 

ఇక ప్రస్తుతం అమరావతి  జిల్లాకు మహారాష్ట్రలోని సోలాపూర్, నాసిక్‌ ప్రాంతాల నుంచి రోజుకు 60–70 టన్నుల ఉల్లిపాయలు కూడా వస్తున్నాయి అని అధికారులు తెలియచేస్తున్నారు. ఉల్లి ధరలు ఆకాశన్నంటిన తరుణంలో ప్రభుత్వం నవంబర్‌ 17 నుంచి రైతు బజార్లు, మార్కెట్‌ యార్డుల్లో రాయితీతో కిలో పాయలు రూ.25కే అమ్మకాలు కొనసాగిస్తున్న సంగతి అందరికి తెలిసందే కదా. ఇక తాజాగా ఈజిప్టు ఉల్లి కూడా వాస్తు ఉండడంతో వినియోగదారులకు ఉల్లిపాయల కొరత చాలా వరకు తగ్గుతుంది అని అధికారులు తెలియ చేస్తున్నారు .

 

మరింత సమాచారం తెలుసుకోండి: