దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది వెటర్నరీ డాక్టర్ దిశ అత్యాచార, హత్య ఉదంతం.  దిశను అత్యంత దారుణంగా అత్యాచారం చేసి ఆ తర్వాత దహనం చేసిన ఘటనలో హ్మద్ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు ని పోలీసులు 24 గంటల్లోనే అరెస్ట్ చేయడం జరిగింది.  అయితే కేసు విచారణ సమయంలో పోలీసులపై దాడి చేయడంతో ఆత్మరక్షణ కోసం వారిని ఎన్ కౌంటర్ చేయడం జరిగింది.  అయితే పోలీసు చేసిన ఎన్ కౌంటర్ పై దేశ వ్యాప్తంగా అభినందనలు, హర్షం వ్యక్తం అయ్యాయి.  కానీ, అదే సమయంలో విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌పై పౌరహక్కులు, మానవ హక్కుల సంఘాలు, ప్రగతిశీల మహిళ సంఘాలు సంఘటపై విమర్శలు గుప్పించారు.  దీంతో ఏకంగా జాతీయ మానవ హక్కుల కమిషన్ రంగంలోకి దిగింది. హైదరాబాద్‌లో ఏడుగురు సభ్యుల బృందం పర్యటించి ఈ ఎన్‌కౌంటర్, కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించింది.  ఇదిలా ఉంటే దిశ నిందితులకు గాంధీ ఆస్పత్రిలో రీపోస్ట్ మార్టం జరిగింది.

 

ఈ సారి తెలంగాణా ఫోరెన్సిక్ టీం కాకుండా, ఎయిమ్స్ టీం దిశ నిందితుల మృత దేహాలకు పోస్ట్ మార్టం చేయనున్నారు. దిశ నిందితుల ఎన్ కౌంటర్ తర్వాత నిందితుల బాడీలను కోర్టు ఆదేశాల మేరకు భద్రపరచాల్సి వచ్చింది.. ఎన్ కౌంటర్ డిసంబర్ 6 న తెల్లవారుజామున జరిగింది.. అయితే స్పాట్ లోనే గాంధీ ఆస్పత్రి పోరెన్సిక్ టీం పోస్ట్ మార్టం నిర్వహించింది. ఒక్కో డెడ్ బాడీకి రీ పోస్ట్ మార్టం చేసేందుకు సుమారు 2 గంటల సమయం పట్టవచ్చని చెప్తున్నారు.  పోస్ట్ మార్టం మొత్తాన్ని వీడియో రికార్డు చేయనున్నారు. ఇప్పటికే గాంధీ మార్చూరిలో నాలుగు మృత దేహాలకు భద్రత కల్పించారు.  

 

ఈ నేపథ్యంలో గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ తో పాటు ఎయిమ్స్ వైద్య బృందం కూడా పాల్గొంది. ఎయిమ్స్ ఫోరెన్సిక్ శాఖ అధిపతి సుధీర్ గుప్తాతో పాటు అభిషేక్ యాదవ్, ఆదర్శ్ కుమార్ వైద్య బృందం రీపోస్టుమార్టం ప్రక్రియను నిర్వహించింది. రీపోస్టుమార్టం సందర్భంగా నిందితులకు తగిలిన బుల్లెట్ విషయంపై ఓ క్లారిటీ వచ్చినట్లు అంటున్నారు.  ఏ1 మహమ్మద్ ఆరిఫ్ శరీరంలో నాలుగు బుల్లెట్ గాయాలు, ఏ2 చెన్నకేశవులు శరీరంలో మూడు బుల్లెట్లు, ఏ3 నవీన్ శరీరంలో రెండు బుల్లెట్లు, ఏ4 శివ శరీరంలో ఒక బుల్లెట్ గాయాన్ని గుర్తించినట్లు సమాచారం. కాగా, పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత రిపోర్టును సీల్డ్ కవర్ లో కోర్టుకు సమర్పించనున్నారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: