తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత అక్కడ తొలిసారిగా అధికారాన్ని చేపట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి, అలానేముఖ్యమంత్రిగా పీఠాన్ని అధిష్టించిన ఆ పార్టీ అధినేత కేసీఆర్, రాష్ట్రాన్ని తనవంతుగా ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు మొక్కవోని దీక్షతో ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా వాటిని ఎదుర్కొని, పలు ప్రజా సంఘాలు, ప్రజలు, రాజకీయ నాయకులు వంటి వారందరి మద్దతు కూడగట్టుకుని ముందుకు సాగిన కేసీఆర్, ఎట్టకేలకు ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారు. 

 

కోట్లాది మంది ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన అప్పటి యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీ గారికి అలానే తమ ఉద్యమంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ గెలుపు అనంతరం కృతజ్ఞతలు చెప్పిన కేసీఆర్, రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా బంగారు తెలంగాణగా మార్చడమే తన ముందున్న లక్యం అని. అలానే రాష్ట్ర సాధన కోసం  ప్రాణాలు వదిలిన త్యాగధనుల కుటుంబాలకు తమవంతుగా సాయం కూడా అందించడం జరిగింది. ఇక అక్కడి నుండి సక్సెస్ఫుల్ గా ముందుకు సాగుతున్న కేసీఆర్, పలు ప్రజాకర్షక పధకాలు ప్రవేశపెట్టడంతో పాటు ప్రజా సెంక్షేమానికి పెద్ద పీట వేస్తూ, అక్కడి సెటిలర్ల కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పాలన కొనసాగిస్తున్నారు. 

 

ఇక గడచిన ఐదేళ్ల పాలనలో ప్రజల మెప్పు సంపాదించిన టిఆర్ఎస్ పార్టీ, ఇటీవల జరిగిన మలి ఎన్నికల్లో కూడా విజయ ఢంకా మ్రోగించింది. అలానే మరొక్కసారి ముఖ్యమంత్రిగా ఎన్నికైన కేసీఆర్, ప్రస్తుతం సమర్ధవంతమైన పాలన అందిస్తూ అన్ని వర్గాల ప్రజలకు ఆకరిస్తుంతూ ముందుకు సాగుతున్నారు. ఇక మరోవైపు ప్రతిపక్షాల విమర్శలను ఏ మాత్రం లక్ష్య పెట్టని కేసీఆర్, తమది ప్రజా మరియు రైతు పక్షపాత ప్రభుత్వం అని, రైతుల కోసం కూడా పలు అద్భుత పధకాలు ప్రవేశపెట్టారు. ప్రజామోదంతోనే మరొక్కసారి కేసీఆర్ ఆద్వర్యంలోని టిఆర్ఎస్ గెలిచిందని, ఆ విధంగా వారిని సంతృప్తి పరచడంలో కేసీఆర్ పూర్తిగా విజయం సాధించారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: