ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా పర్యటనలో మైదుకూరు నుండి మాట్లాడుతూ కలెక్టర్ గారు ఈరోజు యాధృచ్ఛికంగా ఒక జీవోను చూపించారని అన్నారు. ఈ జీవో 23వ తేదీ డిసెంబర్ 2008లో నాన్నగారు ఇచ్చారని రాజోలు, జలధరాశి రిజర్వాయర్ల నిర్మాణాన్ని ఇక్కడే చేపట్టాలని జీవో ఇచ్చారని చెప్పారు. ఆ తరువాత ఈ ప్రాజెక్టుల గురించి, ప్రాజెక్టులు చెయ్యాలన్న ఆలోచన గురించి ఏ ఒక్కరూ కూడా పట్టించుకున్న పాపాన పోలేదని జగన్ అన్నారు.
 
మళ్లీ మీ అందరి ఆశీర్వాదంతో ఈరోజు మీ బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఉన్నాడని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆరు నెలలు తిరగకమునుపే ఈ రెండు ప్రాజెక్టులకు ఈరోజు శంఖుస్థాపన చేస్తున్నానని జగన్ అన్నారు. కుందూ నదిపై రాజోలి వద్ద 2.95 టీఎంసీల నీటిని నిల్వ ఉంచటానికి 1357 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నామని జగన్ చెప్పారు. రాజోలు ఎగువ భాగంలో కర్నూలు జిల్లాలో కోయిలకుంట్ల దగ్గర జలధరాశి వద్ద కూడా మరో రిజర్వాయర్ కట్టబోతున్నామని జగన్ అన్నారు. 
 
ఈ రిజర్వాయర్ కోసం 312 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నామని కుందూ నది వరదను నివారించడమే కాకుండా ఈ నీటిని ఒడిసిపట్టి పంటపొలాలకు మళ్లించబోతున్నామని జగన్ చెప్పారు. ఈ మూడు ప్రాజెక్టుల వలన ఈ ప్రాంతమంతా సస్యశ్యామలం అవుతుందని జగన్ అన్నారు. కర్నూలు జిల్లాలోని చాగలమర్రి, కోయిలకుంట్ల, ఉయ్యాలవాడ కడప జిల్లాలోని ప్రొద్దుటూరు, చాపాడు, దువ్వూరు, మైదుకూరు మండలాలకు మేలు జరుగుందని గర్వంగా వేదిక మీద నుండి తెలియజేస్తున్నానని అన్నారు. 
 
2300 కోట్ల రూపాయల శంఖుస్థాపన కార్యక్రమం ఈరోజు నేను మీ బిడ్డగా చేస్తున్నానని ముఖ్యమంత్రి అయిన ఆరు నెలల్లోనే శంఖుస్థాపన చేస్తున్నానని అన్నారు. ఇదే మైదుకూరు నియోజకవర్గంలో గ్రామ సచివాలయ భవనాల నిర్మాణం కోసం 17.5 కోట్లు ఖర్చు చేయనున్నానని జగన్ తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: