నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మొదటి సారి అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం పార్టీ. జనసేన మద్దతుతో ఆనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రజలనే  రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. 2014 ఎన్నికల ముందు రుణమాఫీ లు... మద్దతు ధరలు మార్కెట్ యార్డులు అంటూ అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చాక లక్ష రూపాయల రుణమాఫీ మాత్రమే చేస్తానంటూ... తెలిపి అది కూడా చేయకుండా ఆంధ్రప్రదేశ్ రైతుల అందరిని ఘోరంగా మోసం చేశారు గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. గతంలో 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు కొనసాగినప్పుడు... రైతులను ముప్పుతిప్పలు పెట్టారు... రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న పట్టించుకున్న పాపాన పోలేదు. రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యాక రైతులకు రుణమాఫీ లు ఉచిత విద్యుత్ను ప్రకటించారు. 

 


 నేడు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి వారసుడు జగన్  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రైతులకు పంట గిట్టుబాటు ధర... రుణమాఫీ లు... పెట్టుబడికి చేయుత ... ఉచితంగా బోర్లు వేయించడం... ఉచిత కరెంట్... ఇలా జగన్మోహన్ రెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయాభివృద్ధికి రైతుల సంక్షేమానికి ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తాజాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు నిర్ణయం  ప్రకటించడంతో అమరావతి రైతులు అందరూ తీవ్ర ఆందోళన చేస్తున్నారు గత కొంత కాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ ఆందోళనల వెనుక టిడిపి అధినేత చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. 

 

అయితే  అమరావతి నుంచి రాజధాని మారుతి జరిగితే ఎక్కడ తమ వర్గానికి రియల్ ఎస్టేట్ వ్యాపారం తగ్గుతుందో అంటూ చంద్రబాబు గగ్గోలు పెడుతున్నారు అని ఆంధ్ర రాజకీయాల్లో  చర్చించుకుంటున్నారు. చంద్రబాబుకు నిజంగా రైతుల మీద అంత ప్రేమ ఉంటే తాను అధికారంలో ఉన్నప్పుడు రైతులను తీవ్ర ఇబ్బందులకు ఎందుకు గురి చేసాడని అనుకుంటున్నారు . కేవలం రాజధాని ఏరియాలో ఉన్న రైతుల గురించి మాత్రమే చంద్రబాబు నాయుడు మాట్లాడారు. అంటే రాష్ట్రం మొత్తం లో ఉన్నది కేవలం 200, 300 మంది రైతులేనా... రాష్ట్రంలో రైతులు ఉన్నది కోట్లల్లో కాదా అని పలువురు భావిస్తున్నారు . చంద్రబాబునాయుడు కేవలం కొంతమంది గురించి ఎందుకు మాట్లాడుతున్నారు. 

 

 పది మంది టీడీపీ రైతులు వచ్చి హడావిడి చేయాగానే  రైతులంతా వచ్చేశారు రైతులకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందంటూ ఆరోపణలు చేస్తున్నారు.. రైతులకు జగన్ సర్కారు అన్యాయం చేసింది అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శలు చేస్తున్నారు. గతంలో తమ ప్రభుత్వ హయాంలో చంద్రబాబుకు  రైతుల మీద లేని ప్రేమ ఇప్పుడు ఎక్కడినుండి  వచ్చింది అంటూ పలువురు చర్చించుకుంటున్నారు. రాష్ట్రంలో ఉన్న రైతులు అందరిని వదిలేసి కేవలం అమరావతి రైతుల గురించి చంద్రబాబు మాట్లాడటం విడ్డూరమని వైసీపీ నేతలు అంటున్నారు . అయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తంలో కోట్లలో రైతులు ఉంటే...  చంద్రబాబు కేవలం అమరావతిలోని  200 300 మంది రైతుల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అన్నది ప్రస్తుతం నెలకొన్న ప్రశ్న.

మరింత సమాచారం తెలుసుకోండి: