వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొన్ని రోజుల వరకు ఇతర పార్టీల నేతలను వైసీపీ  పార్టీలోకి ఆకర్షించడంలో సైలెంట్ గానే ఉంది. కానీ గత కొన్ని రోజుల నుండి ఇతర పార్టీల నేతలను ఆకర్షిస్తూ తమ పార్టీలో చేర్చుకుంటుంది అధికార వైసిపి పార్టీ. ఇప్పటికే టిడిపి యువత విభాగం అధ్యక్షుడు అయిన దేవినేని అవినాష్ వైసీపీలోకి ఆహ్వానించింది. అంతేకాకుండా టిడిపిలో కీలక నేత అయిన వల్లభనేని వంశీ కూడా వైసీపీలోకి చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టిడిపి పార్టీకి రాజీనామా చేసి అసెంబ్లీలో కూడా తనను  ప్రత్యేక సభ్యుడిగా చూడాలి అంటూ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తెలిపిన విషయం తెలిసిందే. 

 

 

 కొంతమంది ముఖ్య నేతలను కూడా టిడిపి నుంచి వైసీపీలో చేర్చుకుంది అధికార పార్టీ. అయితే ఇప్పటికే దేవినేని అవినాష్ తో పాటు దేవినేని అవినాష్ వర్గం మొత్తం వైసిపి తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే.కాగా  మరోసారి దేవినేని అవినాష్ వార్తల్లోకి ఎక్కాడు. ఈసారి 150 మంది టిడిపి నేతలు కార్యకర్తలు దేవినేని అవినాష్ సమక్షంలో వైసీపీలో చేరారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం లోని తొమ్మిదొవ డివిజన్ కు చెందిన టీడీపీ  నేతలు కార్యకర్తలు వైసిపిలో చేరినట్లు  అవినాష్ ట్విట్టర్  వేదికగా  వెల్లడించారు. పార్టీలో చేరిన 150 మంది టీడీపీ నేతలు కార్యకర్తలు జగన్ పాలన పట్ల పథకాల పట్ల ఆకర్షితులయ్యారని దేవినేని అవినాష్ తెలిపారు. 

 

 

 

 అందరికీ వైసిపి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు దేవినేని అవినాష్... స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.కాగా  గతంలో గుడివాడ నుంచి టీడీపీ తరఫున పోటీ చేసిన అవినాష్ ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత టిడిపి అధికారిక కార్యక్రమాల్లో ఎక్కడ పాల్గొనకుండా తాజాగా వైసీపీ తీర్థం పుచ్చుకోన్న విషయం తెలిసిందే. జగన్ సమక్షంలో చేరిన దేవినేని అవినాష్ కు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విజయవాడ తూర్పు నియోజకవర్గం వైసిపి ఇన్చార్జి బాధ్యతలను అప్పగించారు. ఇకపోతే తాజాగా టిడిపికి చెందిన 150 మంది నేతలు కార్యకర్తలు వైసీపీలో చేరడంతో చంద్రబాబుకు మరో షాక్ తగిలినట్టైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: