నూతన సంవత్సర వేడుకలను యువత సంతోషంగా, ఆనందంగా జరుపుకోవాలని, ఇన్సిడెంట్‌ ఫ్రీ (జీరో యాక్సిడెంట్స్‌, జీరో డెత్‌)గా జరుపుకోవాలని రాచకొండ, సైబరాబాద్‌ సీపీలు మహేష్‌ భగవత్‌, వి.సి. సజ్జనార్‌లు తెలిపారు. ఈ మేరకు న్యూ ఇయర్‌ వేడుకలను నిర్వహించే రిసార్టులు, పబ్‌లు, ప్రముఖ హోటళ్లు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, కన్వెన్షన్‌ యజమానులతో శనివారం సమావేశం ఏర్పాటు చేశారు. ‘కార్లు, బైకుల్లో కుటుంబ సభ్యులతో కలిసి పార్టీకి వెళ్తుంటారు.. అలాంటి వారు ప్రత్యేకంగా డ్రైవర్‌ను ఏర్పాటు చేసుకోవాల‌ని సూచించారు. అంతేకాని మద్యం తాగిన మత్తులో డ్రైవింగ్‌ చేసి, ప్రమాదాలు చేయకూడదు’ అని హెచ్చరించారు. ఈ మేరకు 2020 వేడుకల్లో… రోడ్డు ప్రమాదాలు, దుర్ఘటనలు, అపశృతులుకు ఆస్కారం లేకుండా, ప్రశాంతంగా నిర్వహించేందుకు రాచకొండ, సైబరాబాద్‌ పోలీసులు పలు నిబంధనలు, మార్గదర్శకాలను రూపొందించారు. పోలీసులు జారీ చేసిన నిబంధనలను ఈవెంట్స్‌ నిర్వాహకులు, హోటల్స్‌, పబ్‌ యాజమాన్యాలు, ఇతరులు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. అటు, మహిళలకు పటిష్ట భద్రత, రోడ్డు ప్రమాదాల్లో మరణాలను తగ్గించడమే ప్రధాన లక్ష్యంగా.. రాచకొండ, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌లు తమ విజన్‌ 2020 లక్ష్యాలను వివరించారు.

 

నూతన సంవత్సర వేడుకులను రాత్రి 8 నుంచి 1 గంట వరకు నిర్వహించాలి.
వేడుకల నిర్వాహకులు పోలీసుల అనుమతి తీసుకోవాలి.
వేడుకలు జరిగే ప్రాంతాల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి.
డీజేకు అనుమతి లేదు, 45 డెసిబెల్స్‌ మ్యూజిక్‌ శబ్దం మించకూడదు.
డ్రగ్స్‌, మత్తు పదార్థాలు విక్రయించవద్దు.
ట్రాఫిక్‌ రద్దీ, జామ్‌లు తలెత్తకుండా సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేసుకోవాలి.
ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా పార్కింగ్‌ ఏర్పాట్లు చేసుకోవాలి.
మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దు. వేడుకల్లో అశ్లీలం ఉండవద్దు.
మైనర్లకు ఈవెంట్స్‌ జరిగే ప్రాంతాల్లో మద్యం సరఫరా చేయొద్దు.
వేడుకల సందర్భంగా గుర్తు తెలియని వ్యక్తులు ఇచ్చే పానీయాలు తాగొద్దు.
మహిళలు, పిల్లలను నిర్మానుష్య ప్రాంతాల్లో జరిగే వేడుకలకు పంపొద్దు.
క్యాబ్‌, ఆటో డ్రైవర్లు అనుమానాస్పదంగా వ్యవహరిస్తే వెంటనే డయల్‌ 100, లేదా హాక్‌ ఐ యాప్ ద్వారా పోలీసులకు సమాచారం అందించాలి.
వేడుకల ప్రాంతాల్లో డ్రంక్‌ అండ్‌ డ్రైవింగ్‌ నేరమని సూచిక బోర్డులు పెట్టాలి.
డ్రంక్‌ అండ్‌ డ్రైవింగ్‌ లో పట్టుబడితే వాహనం సీజ్‌, 10 వేల జరిమానా.
సైబరాబాద్‌ పరిధిలో ట్రాఫిక్‌కు సంబంధించిన సమస్యలు ఎదురైతే సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ వాట్సాప్‌ నం. 850-041-1111 కు సమాచారం ఇవ్వాలి.
అనుమానాస్పద వ్యక్తుల సమాచారం ఉన్నా, వస్తువులు కనపడినా వెంటనే డయల్‌ 100 లేదా రాచకొండ వాట్సాప్‌ నం. 949-061-7111, సైబరాబాద్‌ వాట్సాప్‌ నం. 949-061-7444 కు సమాచారం అందించాలి.

 

విజన్‌ 2020లో భాగంగా రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో నేరం చేస్తే శిక్ష ఖాయం దిశగా దర్యా ప్తు, విచారణ ఉంటుందని రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ తెలిపారు. కొత్త సంవత్సరం వేడుకల్లో నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: