తెలంగాణ రాష్ట్రంలో ఎంతో పేరు  ప్రఖ్యాతులు సంపాదించుకున్న  ప్రతిష్టాత్మాక నిజామ్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌(నిమ్స్‌)లో వైద్యుల పోస్టులు భారీగా ఖాళీలు ఏర్పడ్డాయి. నిమ్స్ లో ఎన్నో ఏళ్ల తరబడి సర్వీస్ చేసిన ఉద్యోగులు నెలకు సగటున ఇద్దరు వైద్యులు పదవీ విరమణ చేస్తున్నారు. అదియును గాక వైద్యుల మధ్య  అంతర్గత కుమ్ములాటలు జరుగుతుండడం విశేషం. దానికి తోడు కార్పొరేట్‌ ఆస్పత్రులతో పోలిస్తే ఇక్కడ వైద్యులకు ఇచ్చే వేతనాలు చాలా తక్కువగా ఉండటంతో చాలామంది ఆస్పత్రిలో పని చేయలేక వేరొక హాస్పిటల్ను వెతుక్కుంటున్నారు

 

.మరికొంత మంది పని భారము ఎక్కువవడంతో ఆస్పత్రిని వీడుతున్నారు. అయినా. ఎప్పటికప్పుడు ఈ ఖాళీలను భర్తీ చేసేందుకు ఆస్పత్రి యాజమాన్యం నోటిఫికేషన్‌ జారీ చేస్తున్నారు. ఇన్ని కారణాల దృష్ట్యా ఇక్కడ పని చేసేందుకు పెద్దగా డాక్టర్లు ఎవరు ముందుకు రావడం లేదు. ఒకవేళ వచ్చిన వారు కూడా రెండు మూడేళ్ల తర్వాత ఆస్పత్రిని వీడుతున్నారు.వీటన్నింటికీ కారణము డాక్టర్ల మధ్య సఖ్యత లేకపోవడం కూడా ఒక కారణం.

 

ఉన్నతాధికారులు కూడా వీరిని ఆపే ప్రయత్నం ఏ మాత్రము చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.  ఫలితంగా ప్రస్తుతం 311 పోస్టులకు గాను  133 పోస్టులు ఖాళీగా ఉన్నాయిదీన్నిబట్టి ఏ రేంజ్ లో ఖాళీలు ఉన్నాయో మనకు అర్థం అవుతున్నది.. ప్రొఫెసర్, అడిషనల్, అసోసియేట్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు భారీగా ఖాళీగా ఉండటంతో సూపర్‌ స్పెషాలిటీ వైద్యవిద్యపైనే కాదు. దీని ప్రభావము రోగుల చికిత్సలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఎప్పుడైతే రోగుల చికిత్సపై వైద్యులు నిర్లక్ష్యం చేస్తే తే పేషెంట్లు జాయిన్ కావాలన్నా సంకోచిస్తారు.

 

 సీనియర్‌ వైద్యులు లేకపోవడంతో ఆ పని భార మంతా రెసిడెంట్లపై పడుతుంది. వీరు వారి విద్యను మరియు పేషెంట్లను చూడటము కష్టతరమవుతుంది. అదియు గాక చికిత్సల్లో వారికి సరైన అనుభవం లేకపోవడంతో వారు కూడా ఏమీ చేయలేక చేతులెత్తేస్తున్నారు.ఒకవేళ తెలియనిది తెలుసుకుని చేస్తే సీనియర్ వైద్యులు ఏమంటారో అని భయం. పదవీ విరమణ చేసిన కొంత మంది సీనియర్‌ వైద్యులు ఆ తర్వాత కూడ ఇక్కడ పని చేసేందుకు సుముఖంగా ఉన్నప్పటికీ వారిని తీసుకునేందుకు నిమ్స్ యాజమాన్యం విముఖత ప్రదర్శిస్తోందని తెలుస్తున్నది...

మరింత సమాచారం తెలుసుకోండి: