సంవత్సరంలో 12 నెలలు.. సంవత్సరంలో చివరి నెల డిసెంబర్.  డిసెంబర్ 31 వ తరువాత జనవరి నెల ప్రారంభం అవుతుంది.  డిసెంబర్ 31 వ తేదీ అర్ధరాత్రి నుంచి ప్రపంచంలో సంబరాలు ప్రారంభం అవుతాయి.  ప్రపంచం మొత్తం న్యూఇయర్ వేడుకలను అంగరంగవైభవంగా నిర్వహించుకుంటూ ఉంటుంది.  అసలు న్యూఇయర్ వేడుకలను నిర్వహించడం వెనుక చాలా కారణాలు ఉన్నాయి. సూర్యుడు చుట్టూ భూమి తిరగడానికి 365 రోజుల సమయం పడుతుంది.  ఒక్కోసారి అంతకంటే ఎక్కువ సమయం పట్టొచ్చు. అలా ఎక్కువ సమయం పడితే దాన్ని లీప్ ఇయర్ అంటారు.  ఇది నాలుగేళ్లకు ఒకసారి వస్తుంది.  


అసలు జనవరి 1 న ఈ వేడుకలు ఎందుకు జరుపుకుంటారు. జనవరికి ఆ పేరు ఎలా వచ్చింది.  ఎవరు మొదట దీనిని స్టార్ట్ చేశారు... తెలుసుకుందాం.  క్రీస్తుపూర్వం 45వ సంవత్సరంలో జూలియస్ సీజర్ జూలియన్ క్యాలెండర్‌ను ప్రవేశపెట్టారు.  సూర్యుడి చుట్టూ భూమి తిరిగే కాలాన్ని బట్టి ఈ క్యాలెండర్ ను ప్రవేశపెట్టారు.  ఇలా క్యాలెండర్ ను తయారు చేసిన రోజును సంవత్సరం, రోజును నిర్ణయించాల్సి వచ్చింది.  
రోమన్ కు చెందిన జూలియస్ ఈ క్యాలెండర్ ను ప్రవేశపెట్టినప్పుడు సంవత్సరంలో మొదటి నెలను వారి దేవత జనస్ పేరుమీదుగా జనవరి అని తీసుకున్నారు.  అందుకే రోమన్లకు ఈ జనవరి నెల చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది.   ఎలాంటి ముఖ్యమైన పనినైనా రోమన్లు, యూరోపియన్లు జనవరి నెలలోనే ప్రారంభిస్తారు.  అందుకే వారికి ఈ మాసం చాలా పవిత్రమైన మాసం.  దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.  


జనవరి ముందు వరకు పగటిపూట సమయం తక్కువగా ఉంటుంది.  చీకటి ఎక్కువగా ఉంటుంది.  అందుకే ఏ పని చేయడానికి కూడా వెనకడుగు వేస్తుంటారు.  కాలం ముందుకు సాగనివ్వదు.  అందుకే జనవరి ముందు వరకు వారు ఎలాంటి పనులు చేయలేరు.  జనవరి నుంచి పగటి కాలం పెరుగుతుంది.  కాలం పరుగులు తీస్తుంది.  అందుకే జనవరి రోమన్లకు ఏంటో ఉపయుక్తమైన రోజుగా వర్ణిస్తుంటారు.  రోమన్లు ప్రవేశపెట్టిన ఈ క్యాలెండర్ ను వారి సామ్రాజ్యం విస్తరించే కొద్దీ దీన్ని కూడా విస్తరించుకుంటూ వచ్చారు.  ఆ తరువాత క్రైస్తవుల సామ్రాజ్యం వచ్చింది.  వాళ్ళు మాత్రం జనవరి 1 న కాకుండా మార్చి 25 వ తేదీన మొదట కొత్త సంవత్సరంగా జరుపుకునే వారు.  గ్రెగేరియన్ క్యాలెండర్ ను పక్కన పెట్టేవారు.  1752 వరకు ఇంగ్లాండ్ దేశం మార్చి 25 వ తేదీనే కొత్త సంవత్సరంగా జరుపుకున్నది.  1752 నుంచి జనవరి 1 వ తేదీని కొత్తసంవత్సరంగా జరుపుకుంటున్నారు.  ఇలా ఈ గ్రెగేరియన్ క్యాలెండర్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించడంతో జనవరి 1 వ తేదీని కొత్త సంవత్సరంగా జరుపుకునే ఆచారం మొదలైంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: