కొత్త సంవత్సరం వేడుకలు అనగానే చిన్నాచితకా ముసలి ముతకా అందరు ఎంతో ఉత్సాహంగా రాత్రంతా మెలకువగా ఉంటూ అనందోత్సవాలనడుమ పాతజ్ఞాపకాలకు బై బై చెబుతూ కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తారు. లోకం మొత్తం జరుపుకునే ఈ వేడుకలను జనవరి 1 వతారీఖునే ఎందుకు జరుపుకోవాలో అని ఎప్పుడైనా ఆలోచించిన వారున్నారా? అంత సమయం ఎక్కడుందంటారా ? అయితే తెలుసుకోండి మీ కోసం నేను తెలియచేస్తున్నా..

 

 

ఇక దీనికి సమాధానం కావాలంటే 2000 సంవత్సరాల వెనక్కు వెళ్లాల్సిందే. మనం అక్కడకు వెళ్లి తెలుసుకుంటే జూలియస్ సీజర్ క్రీస్తుపూర్వం 45వ సంవత్సరంలో క్యాలెండర్‌ను ప్రవేశపెట్టారు. క్యాలెండర్‌ను సూర్యుని చుట్టూ భూమి తిరగడానికి పట్టే సమయం ఆధారంగా రూపొందించారట. ఇకపోతే భూమి సూర్యుడి చుట్టూ తిరగడానికి 365 రోజుల కంటే కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. అందుకే మనం కొన్నిసార్లు లీప్ డే ఒకదానిని ప్రవేశపెట్టాల్సి వచ్చిందని కీల్ యూనివర్శిటీ అబ్జర్వేటరీ డైరెక్టర్ డాక్టర్ జాకో వాన్ లూన్ తెలిపారు.. అయితే భూమి రోజులో ఒకసారి తన చుట్టూ తాను కూడా తిరుగుతుంటుంది. కాబట్టే రోజూ ఒకసారి సూర్యోదయం, సూర్యాస్తమయం అవుతుంటాయి.

 

 

కాగా, క్యాలెండర్‌ను ప్రవేశపెట్టేప్పుడు సంవత్సరాన్ని మొదలు పెట్టే రోజును సీజర్ ఎంచుకోవాల్సి వచ్చింది. ఇకపోతే ఈ జనవరి నెల రోమన్లకు ప్రముఖమైనది. ఎందుకంటే వారి దేవత జనస్ పేరిట ఏర్పడిన నెల కాబట్టి.. ఈ విధంగా రోమన్లు తమ అధికారాన్ని విస్తరించిన కొద్దీ వాళ్ల రాజ్యంతో పాటు క్యాలెండర్ కూడా ఆయా ప్రాంతాలకు చేరింది. అయితే, పాశ్చాత్యంలో 5వ శతాబ్ధంలో రోమన్ల సామ్రాజ్యం పతనమై ఆ స్థానంలో క్రైస్తవ మతం అధికారం చెలాయించింది. ఈ సమయంలో క్రైస్తవ మతం వారు జనవరి 1వ తేదీ అన్యమత సంప్రదాయంగా చూసేవాళ్లు. చాలా క్రైస్తవ దేశాలు కొత్త సంవత్సరాది మార్చి 25వ తేదీ కావాలని కోరుకున్నాయి.

 

 

ఎందుకంటే.. దేవదూత గాబ్రియెల్.. మేరీకి కనిపించిన తేదీగా దానికి ప్రాశస్త్యం ఉంది. ఇదిలా ఉండగా క్యాథలిక్ చర్చిలతో సంబంధం లేని ప్రొటెస్టెంట్ వర్గానికి చెందిన ఇంగ్లండ్ మాత్రం 1752వ సంవత్సరం వరకూ కొత్త సంవత్సర దినోత్సవాన్ని మార్చి 25నే జరుపుకొంటూ వచ్చింది. అయితే, 1752లో దేశ పార్లమెంటు ఒక చట్టం తీసుకువచ్చి, యూరప్‌తో పాటుగా ఇంగ్లండ్ కూడా కొత్త సంవత్సరాన్ని జనవరి 1వ తేదీన జరుపుకునేట్లు చేసింది. ఇక వర్తమానంలోకి వస్తే.. ప్రస్తుతం చాలా దేశాలు గ్రెగోరియన్ క్యాలెండర్‌నే ఉపయోగిస్తున్నాయి. అందుకే మనం ప్రతి ఏటా జనవరి 1వ తేదీన కొత్త సంవత్సర వేడుకలను, జరుపుకుంటున్నాం..

 

మరింత సమాచారం తెలుసుకోండి: