మరికొద్ది రోజుల్లో 2019 సంవత్సరం ముగియనుంది. కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్న ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా 2020 న్యూ ఇయర్ వేడుకలకు అంతా రెడీ అవుతున్నారు. వచ్చే ఏడాది మొట్టమొదటి క్షణాలకు ఘనంగా ఆహ్వానం పలుకుతూ న్యూ ఇయర్ లోకి వెళ్లాలనే ప్లానింగ్ తో చాలామంది ప్రపంచవ్యాప్తంగా కేకులు మరియు పార్టీలు చేసుకోవటానికి ఇప్పటి నుండే సరైన ప్లానింగ్ లు వేసుకుంటున్నారు.

 

ఇటువంటి తరుణంలో ప్రతి సంవత్సరం న్యూ ఇయర్ వేడుకల్లో ఎక్కువ రోడ్డు ప్రమాదం మందు బాబు ల వల్ల జరుగుతున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల పోలీసులు మరియు ప్రభుత్వాలు రాబోయే ఏడాదికి పగడ్బందీ చర్యలతో ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా సరికొత్త నిర్ణయాలు తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2020 వేడుకల్లో… రోడ్డు ప్రమాదాలు, దుర్ఘటనలు, అపశ్రుతులకు ఆస్కారం లేకుండా.. ప్రశాంతంగా నిర్వహించేందుకు రాచకొండ, సైబరాబాద్‌ పోలీసులు పలు నిబంధనలు, మార్గదర్శకాలను రూపొందించారు. పోలీసులు జారీ చేసిన నిబంధనలను ఈవెంట్స్‌ నిర్వాహకులు, హోటల్స్‌, పబ్‌ యాజమాన్యాలు, ఇతరులు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు.

 

కొత్త సంవత్సరం ప్రారంభ సమయంలో హ్యాపీగా వేడుకలు జరుపుకున్న పర్లేదు కానీ పబ్లిక్ కి వేడుకల పేరుతో రచ్చ చేయడం మరియు గొడవలకు దిగటం అమ్మాయిలను ఏడిపించడం వంటి పిచ్చి పనులు చేస్తే రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పోలీసులు రూల్స్ అతిక్రమిస్తే జైల్లో పెట్టడం ఖాయమని ఈసారి బాణసంచా కాల్చిన బార్లో పబ్బులో అసభ్యంగా ప్రవర్తించిన అశ్లీల వేషాలు వేసినా చర్యలు తప్పవని తాగి వాహనాలు నడిపితే వాహనాన్ని సీజ్ చేయడం గ్యారెంటీ అని పోలీసులు ముందే హెచ్చరికలు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించి వచ్చే ఏడాదిలో ఇబ్బందులపాలు కావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎక్కడ ఎవరికి ఎటువంటి ప్రమాదం లేకుండా వేడుకలు జరగాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: