చంద్రబాబునాయుడు యూజ్  అండ్ త్రో విధానం గురించి తెలియని వాళ్ళుండరు. ఫార్టీ ఇయర్స్ ను నమ్ముకుంటే నట్టేట ముణిగిపోవటం ఖాయమని ఆయనతో సన్నిహితంగా ఉన్న వాళ్ళు ఎవరైనా చెబుతారు. ఇపుడిదంతా ఎందుకంటే తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను చూస్తుంటే అందరికీ ఇదే విషయం గుర్తుకొస్తోంది. జగన్ నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత కనబరచిన చంద్రబాబు తాజాగా  యూటర్న్ తీసేసుకున్నారు.

 

ఇంతకీ విషయం ఏమిటంటే ఏపికి మూడు రాజధానులను జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఎప్పుడైతే జగన్ ప్రతిపాదన చేశారో అమరావతి ప్రాంతంలోని రాజధాని గ్రామాలకు చెందిన ఓ సెక్షన్ జనాల్లో మాత్రమే వ్యతిరేకత మొదలైపోయింది.  ఈనెల 27వ తేదీన క్యాబినెట్ సమావేశంలో జిఎన్ రావు కమిటి నివేదిపై నిర్ణయం తీసుకున్న తర్వాత మిగిలిన జిల్లాల్లోని ప్రజల స్పందన బయటపడుతుందనే అనుకోవాలి.

 

ఈలోగానే పవన్ తొదర పడిపోయారు. ’ఎద్దు ఈనిందనగానే గుంజకు కట్టేయ’మనే రకం పవన్ అన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకనే జగన్ ప్రతిపాదన రాగానే చంద్రబాబును చూసి పవన్ రెచ్చిపోయారు. తన పార్టీ తరపున నాదెండ్ల మనోహర్, సోదరుడు నాగుబాబును పంపించారు. స్ధానికులతో సమావేశం సందర్భంగా మనోహర్ , నాగుబాబు కూడా జగన్ కు వ్యతిరేకంగా నోటికొచ్చినట్లు మాట్లాడేశారు.

 

ఇదంతా పవన్ ఎందుకు చేశారయ్యా అంటే చంద్రబాబును చూసుకునే అన్న విషయం ఎవరికైనా అర్ధమైపోతుంది. జగన్ ప్రకటన వచ్చిన మొదటి రెండు రోజులు నోటికొచ్చినట్లు మాట్లాడిన చంద్రబాబు మూడో రోజు మాత్రం యూటర్న్ తీసుకున్నారు. ప్రజలందరూ   ఏది కరెక్టనుకుంటే దాన్ని ఫాలో అవటానికి తనకు ఏమీ అభ్యంతరం లేదని చంద్రబాబు తేల్చేశారు. జగన్ ప్రకటనపై జనాల్లోని సానుకూలత చూసిన తర్వాత వేరే దారిలేక యూటర్న్ తీసేసుకున్నారు.  అలావాటైన విద్యే కాబట్టి చంద్రబాబు తేలిగ్గానే నాలుక మడతేసేశారు. మరి ఈ మాజీ సిఎంను చూసుకుని నోటికొచ్చినట్లు మాట్లాడేస్తున్న పవన్  ఏం చేస్తాడు ?

మరింత సమాచారం తెలుసుకోండి: