రాజకీయాల్లో అవకాశాలు అరుదుగా వస్తుంటాయి. అలా అరుదుగా వచ్చినప్పుడే ఆ అవకాశాల్ని సరిగా ఉపయోగించుకోవాలి. అలా ఉపయోగించుకుంటేనే ఏ నాయకుడైన అనుకున్న ఫలితాన్ని రాబట్టగలుగుతాడు. అయితే సరిగా ఇదే పనిని యువ నేత దేవినేని అవినాష్ కూడా చేస్తున్నాడు. మొన్నటివరకు టీడీపీలో ఈయనకు ఏ విధంగా నష్టం జరిగిందో తెలిసిందే. ఇక అందులో ఉన్న నష్టం తెలుసుకున్న అవినాష్...వైసీపీలోకి వచ్చేశారు. అయితే పార్టీలోకి వచ్చినంత మాత్రాన ఎవరికి పదవులు త్వరగా రావు.కానీ అవినాష్ ఫాలోయింగ్, ఆయన పడిన కష్టం తెలుసు కాబట్టి వెంటనే జగన్ అవినాష్‌కు విజయవాడ తూర్పు ఇన్-చార్జ్ పదవి ఇచ్చారు.

 

అయితే తనకు కావలసిన పదవే దక్కడంతో అవినాష్...పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. తూర్పులో టీడీపీ బలంగా ఉన్న విషయం తెలిసిందే. మొన్న ఎన్నికల్లో ఇక్కడ నుంచి గద్దె రామ్మోహన్ మంచి మెజారిటీతో విజయం సాధించారు. ఇక ఆయనకు నియోజకవర్గంలో కూడా మంచి ఫాలోయింగే ఉంది. మరి ఇలా టీడీపీ బలంగా ఉన్న నియోజకవర్గంలో వైసీపీని నిలబెట్టడం అనేది చాలా కష్టం. కానీ అవినాష్ ఆ కష్టాన్ని కూడా ఇష్టం తీసుకుని...పదవి వచ్చిన దగ్గర నుంచి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.

 

వచ్చే విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగరవేసి తన సత్తా చాటాలని భావిస్తున్నారు. ఆ మేరకు తన వంతు ప్రయత్నాలు కూడా మొదలుపెట్టేశారు. నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వాటి పరిష్కార మార్గానికి కృషి చేస్తున్నారు. పైగా తమ పార్టీ కూడా అధికారంలో ఉండటం సమస్యలు త్వరగానే పరిష్కారం అవుతున్నాయి. ఇక అవినాష్ నాయకత్వాన్ని చూసి నియోజకవర్గంలోని వివిధ పార్టీ కార్యకర్తలు కూడా వైసీపీలో చేరుతున్నారు.

 

తాజాగా కూడా 9వ వార్డుకు సంబంధించిన టీడీపీ కార్యకర్తలు వందల సంఖ్యలో అవినాష్ వెనుక నడవడానికి సిద్ధమయ్యారు. ఈ విధంగా అవినాష్ తూర్పులో మరింత ఫాలోయింగ్ పెంచుకుంటూ..వైసీపీని బలోపేతం చేస్తున్నారు. ఇక ఈ ఊపులో వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగరవేయడం ఖాయం కనిపిస్తుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: