తెలంగాణ ఉద్యమం సమయంలో టీడీపీ పరిస్తితి ఎలా ఉందో ప్రతి ఒక్కరికీ తెలుసు. అటు ప్రత్యేక తెలంగాణకు మద్ధతు ఇవ్వలేక, ఇటు సమైక్యంగా ఉండాలని గట్టిగా చెప్పకపోవడం వల్ల టీడీపీకు చాలా పెద్ద డ్యామేజ్ జరిగింది. ఇక ఆ పార్టీ నేతలు కూడా ఏ ప్రాంతానికి వారు మద్ధతు తెలపడం వల్ల ఇబ్బందికర పరిస్తితులు వచ్చాయి. ఈ పరిస్తితులు దెబ్బకు తెలంగాణలో ఆ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. అయితే ఏపీలో ఇంకా బలంగా ఉండటం వల్లే రాష్ట్ర విభజన జరిగాక అధికారంలోకి రాగలిగింది.

 

కానీ 2019 ఎన్నికల్లో ఆ పార్టీ అధికారం కోల్పోయి వైసీపీ అధికారంలోకి రావడంతో కష్టాలు మొదలయ్యాయి. అసలే ఘోర ఓటమితో టీడీపీ చాలా నష్టపోయింది. ఇక ఆ తర్వాత చాలామంది నేతలు కూడా పార్టీని వీడి డ్యామేజ్ చేశారు. ఇప్పుడు జగన్ వేసిన అదిరిపోయే వ్యూహంతో టీడీపీ మరింత వీక్ అయ్యేలాగా కనిపిస్తుంది. జగన్ మూడు రాజధానుల అంశం తెరపైకి తీసుకురావడంతో టీడీపీలో కూడా చీలిక వచ్చేసినట్లు కనపడుతుంది.

 

టీడీపీ అధినేత చంద్రబాబు కేవలం అమరావతినే రాజధానిగా ఉండాలని ఫిక్స్ అయిపోయారు. అందుకు తగ్గట్టుగానే వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ కూడా చేస్తున్నారు. కానీ ఉత్తరాంధ్ర, రాయలసీమ నేతలు కొందరు బాబు నిర్ణయానికి వ్యతిరేకంగా...జగన్ ప్రకటనకు మద్ధతుగా మాట్లాడుతున్నారు. మరికొందరు బాబుకు మద్ధతుగా...జగన్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు బహిరంగంగా ప్రకటనలు చేశారు. అయితే వీరే ప్రకటనల వల్ల సొంత పార్టీలోనే ఇతర ప్రాంతాల నేతలకు కోపం తెప్పిస్తుంది.

 

విశాఖని సమర్ధిస్తూ ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు మాట్లాడుతుంటే...అమరావతి ప్రాంతంలోని నేతలకు ఇబ్బందిగా ఉంది. ఇటు రాయలసీమలో పరిస్తితి కూడా అలాగే ఉంది. ఇక అమరావతి ఒక్కటే రాజధానిగా ఉండాలని అక్కడి టీడీపీ నేతలు మాట్లాడుతుండటంతో మిగతా వాళ్ళకు ఇబ్బందిగా ఉంది. అయితే తాజాగా అనంతపురం జిల్లా అధ్యక్షుడు బి‌కే పార్థసారథి చేసిన వ్యాఖ్యలు సంచలన సృష్టిస్తున్నాయి. మూడు చోట్ల హైకోర్టు బెంచ్ వుంటే.. న్యాయవాదులు మూడు చోట్లా వుండాల్సి వస్తుందని, రెండో చోట్ల అసెంబ్లీ, సెక్రెటేరియట్ వుంటే అధికారులు రెండు చోట్ల కాపురాలుండాల్సి వస్తుందని అన్నారు.

 

మరో అడుగు ముందుకేసి న్యాయవాదులు మూడేసి, అధికారులు రెండేసి పెళ్ళిళ్ళు చేసుకోవాల్సి వుంటుందని చెప్పుకొచ్చారు పార్థసారథి. ఇక ఈ వ్యాఖ్యలు టీడీపీలో చిచ్చురేపేలా ఉన్నాయి. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో ప్రజలు కూడా ఈ వ్యాఖ్యలపై ఆందోళనలకు దిగే అవకాశముంది. మొత్తం మీద సొంత నేతలే టీడీపీకి డ్యామేజ్ చేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: