హైదరాబాద్ షాద్నగర్లో వైద్యురాలు దిశా అత్యాచారం  హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు కూడా వ్యక్తమయ్యాయి. ఇకపోతే దిశ ఘటనలో నలుగురు నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. దిశ కేసులో నలుగురు నిందితుల ఎన్కౌంటర్ దేశవ్యాప్తంగా పెద్ద దుమారమే రేపింది. కొంత మంది ఆడ పిల్లలపై అత్యాచారాలు చేసే వారికి ఎన్కౌంటర్ సరైన శిక్ష అని సమర్థిస్తే  ఇంకొంతమంది చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఎన్కౌంటర్ చేశారని వ్యతిరేకించారు. ఇకపోతే ఎన్కౌంటర్ జరిగిన నాటి నుండి ఎన్ కౌంటర్లపై విచారణ కొనసాగుతూనే ఉంది. మొదట ఎన్కౌంటర్ ఫేక్ అని ఆరోపణలు రావడంతో జాతీయ మానవ హక్కుల కమిషన్  విచారణ జరిగింది. అటు ఎన్కౌంటర్ ను వ్యతిరేకిస్తూ తెలంగాణ హైకోర్టు సహా సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు కావడంతో... విచారణ జరిగే  వరకు నలుగురు నిందితులు మృతదేహాలను భద్రపరచాలని ఆదేశించినది  సుప్రీంకోర్టు. 

 


 అయితే తాజాగా హైకోర్టులో దాఖలైన పిటీషన్పై విచారణ జరిపిన హైకోర్టు. నిందితుల మృతదేహాలను రీ  పోస్టుమార్టం చేయాలని హైకోర్టు భావించింది  దీనికి మృతదేహాల పరిస్థితి ఎలా ఉందో అని గాంధీ ఆసుపత్రి సూపర్-ఇండెంట్ ని అడిగి తెలుసుకున్నారు. కోర్టు విచారణకు హాజరైన గాంధీ ఆసుపత్రి సూపర్-ఇండెంట్ కిరణ్... మృతదేహాలు ఇప్పటికే 50 శాతం కుళ్ళియాయని మరో వారంలో 100% కుళ్ళిపోయే అవకాశం ఉందని హైకోర్టు లో వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో రీ పోస్టుమార్టం చేయించేందుకు నిర్ణయించింది హైకోర్టు. అయితే తెలంగాణకు సంబంధించిన వైద్యులు పై తనకు నమ్మకం లేదని పిటిషనర్ పేర్కొనగా ఢిల్లీ నుంచి ఫోరెన్సిక్ నిపుణులను రప్పించి నలుగురు నిందితుల పోస్టుమార్టం చేయించింది  హైకోర్టు. 

 


 అయితే తాజాగా రీ  పోస్ట్ మార్టం పూర్తి కావడంతో నిందితుల అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు సిద్ధమయ్యారు. నలుగురు నిందితులు శివ నవీన్ చెన్నకేశవులు అంత్య  క్రియలు హిందూ స్మశాన వాటికలో నిర్వహించనున్నారు. దిశ కేసులు ఏ1 గా ఉన్న మహమ్మద్ ఆరిఫ్ అంత్యక్రియలను ముస్లిం సంప్రదాయం ప్రకారం నిర్వహించనున్నారు. ఇప్పటికే నిందితుల మృతదేహాలు వారి స్వగ్రామాలకు చేరుకున్నట్లు సమాచారం. అయితే నిందితుల్లో నవీన్ శివ లకు పెళ్లి కాకపోవడంతో... వారి మృతదేహాలకు గ్రామస్తులు కత్తితో పెళ్లి జరిపించి  అనంతరం అంత్యక్రియలు జరపనున్నారు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: