జార్ఖండ్ ఎన్నికల ఫలితాలపై ప్రధాని నరేంద్ర మోడీ , హోంశాఖ మంత్రి , బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా లు స్పందించారు . కాంగ్రెస్ , జార్ఖండ్ ముక్తి మోర్చా ( జేఎంఎం ) కూటమికి అభినందలు తెలిపారు . జార్ఖండ్ అభివృద్ధి కి కేంద్రం కట్టుబడి  ఉందన్న మోడీ, షా లు , ప్రజాతీర్పు గౌరవిస్తున్నట్లు వెల్లడించారు . పాలన లో కూటమికి అంత మంచే జరగాలని కోరుకుంటున్నామని చెప్పారు . జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ కి గట్టి ఎదురుదెబ్బ తగిలిన విషయం తెల్సిందే .

 

మొత్తం 81  స్థానాలున్న జార్ఖండ్ అసెంబ్లీ లో కాంగ్రెస్ , జేఎంఎం కూటమి 47  స్థానాలు గెల్చుకుని అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది .   బీజేపీ కేవలం 25  స్థానాలకే   పరిమితమయింది . యెరులు ఇతరులు తొమ్మిది స్థానాలను దక్కించుకున్నారు . అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత ముఖ్యమంత్రి రఘువర్ దాస్ , రాజ్ భవన్ లో గవర్నర్  ద్రౌపది ని  కలిసి రాజీనామా పత్రాన్ని అందజేశారు . అనంతరం రఘువర్ దాస్ మీడియాతో మాట్లాడుతూ ప్రజాతీర్పును గౌరవిస్తున్నట్లు చెప్పుకొచ్చారు . ప్రధాన ప్రతిపక్షంగా ప్రజాసమస్యలపై పోరాటం చేస్తామని అన్నారు . ఈ ఓటమికి తనదే పూర్తి బాధ్యత అని చెప్పారు .

 

ఇది  కేవలం తన ఓటమి మాత్రమేనని , బీజేపీ ఓటమి కాదని అన్నారు .  ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ , జేఎంఎం నేతలు హర్షాతిరేకాన్ని వ్యక్తం చేశారు . ప్రజాభిప్రాయానికి అనుగుణంగా పాలన కొనసాగిస్తామని ఇరు పక్షాల నేతలు వెల్లడించారు .  జార్ఖండ్  నూతన ముఖ్యమంత్రి గా హేమంత్ సొరేన్ ఎన్నిక లాంఛనప్రాయమే కానుంది .  ఉప ముఖ్యమంత్రి పదవి ఇక ఎవరికి దక్కనుందన్నది ఆసక్తికరంగా మారింది . ఈ విషయమై సొరేన్ ప్రశ్నించగా కొద్దిరోజుల్లోనే స్పష్టత వస్తుందని తెలిపారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: