జార్ఖండ్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. 81 అసెంబ్లీ స్థానాలకు గాను జార్ఖండ్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి . కాగా  ఎన్నికల ఫలితాలు నేడు విడుదల అయ్యాయి. ఎన్నికల ఫలితాల్లో ఎవరూ ఊహించని విధంగా అనూహ్యంగా జేఎంఎం కాంగ్రెస్ కూటమి విజయాన్ని సాధించింది. మొదటినుంచి బీజేపీ పార్టీ వెనుకంజ లోనే ఉంది. బిజెపి జేఎంఎం పార్టీలు నువ్వానేనా అన్నట్టుగా మొదటి రౌండ్ నుంచి పోటాపోటీగా ఆదిక్యత ను సాధించుకుని వెళ్లాయి. ఈ నేపథ్యంలో ఏ పార్టీకి సరైన మద్దతు కట్టబెట్టలేదు జార్ఖండ్ ప్రజలు. దీంతో కాంగ్రెస్ జేఎంఎం  కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. 

 

 

 

 అయితే బీజేపీకి ప్రతిచోటా చుక్కెదురైంది. గెలిచిన అసెంబ్లీ స్థానాల్లో కూడా తక్కువ ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది బీజేపీ . ఎస్సీ ఎస్టీ రిజర్వుడు స్థానాలు గత సంవత్సర ఎన్నికల్లో గెలిచి గెలిచిన ఎమ్మెల్యేలు... తమ సిట్టింగ్  స్థానాన్ని కాపాడుకోలేక పోయారు. దీనికి కారణం ఎస్సీ ఎస్టీ రిజర్వుడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బిజెపి అవలంభించిన తీరు అని స్పష్టంగా తెలుస్తోంది. గతంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీలకు సంబంధించి రెండు టెనెఎన్సీ  చట్టాలను సవరణ చేయడం గిరిజనులు జీర్ణించుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో బిజెపి ప్రభుత్వానికి గిరిజనుల్లో భారీగానే వ్యతిరేకత ఏర్పడింది..  దీంతో ఎస్సీ ఎస్టీ రిజర్వుడ్ స్థానాలు విజయం సాధించలేకపోయింది బిజెపి. 

 

 

 

 గతంలో ఎన్నికల్లో మెజారిటీ ని సొంతం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బిజెపి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన అభ్యర్థి ఇప్పుడు ఓటమి పాలవడం చర్చనీయాంశంగా మారింది. ఝార్ఖండ్  ఎన్నికల్లో ప్రస్తుత సీఎం బిజెపి సీనియర్ నేత... రఘుబర్  దాస్  తన అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా గెలవలేక పోయారు. ముఖ్యమంత్రి బిజెపి సీనియర్ నేత అయిన రఘుబర్  దాస్ పై  స్వతంత్ర అభ్యర్థి సరయి రాయ్ 8 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొండం  ప్రస్తుతం ఝార్ఖండ్  రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే జార్ఖండ్ లో బీజేపీ ఓటమి పై స్పందించిన రఘుబర్  దాస్ ... ఇది బిజెపి ఓటమి కాదని... తన పరాజయం  అంటూ వ్యాఖ్యానించారు. కాగా నేడు ఝార్ఖండ్  ఫలితాలు బీజేపీకి భారీ షాక్ తగిలింది. బీజేపీకి చెందిన ఆరుగురు మంత్రులు సహా స్పీకర్  ఓటమి పాలవడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: