జగన్ తీసుకునే సంచలన నిర్ణయాల వల్ల ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం రోజురోజు వేడెక్కుతుంది. జగన్ సీఎంగా గెలిచినప్పటినుంచి జగన్ తనదైన మార్క్ తో ముందుకు వెళ్తున్నారు. తాజాగా రాజధాని మార్పు చేస్తారని చెప్పడంతో రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయం మారిపోయింది. దీన్ని కొంత మంది సమర్దిస్తుంటే మరికొందరు ఇది సరైన నిర్ణయం కాదని ఆరోపిస్తున్నారు. ఈ నిర్ణయం సెగ చంద్రబాబుకు కూడా గట్టిగా తగిలింది. కొంత మంది టీడీపీ కార్యకర్తలు కూడా ఇది సరైన నిర్ణయం అని వాదిస్తున్నారు. దీనితో చంద్రబాబుకు మరో షాక్ తగిలింది. ఇప్పుడు మరో పెద్ద షాక్ తగలనుంది రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తుంది.             

 

కష్టాల్లో ఉన్న టీడీపీకి గుడ్ బై చెప్పేందుకు మరో మాజీమంత్రి సిద్ధమవుతున్నారా ? ఈ ప్రశ్నకు రాజకీయవర్గాల్లో అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఏపీ సీఎం జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనకు సంపూర్ణంగా మద్దతు ప్రకటించిన మాజీమంత్రి కొండ్రు మురళి... ఈ విషయంలో చంద్రబాబును తాము ఒప్పిస్తామని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తమకు పార్టీ కంటే ప్రాంతమే ముఖ్యమని ఆయన చేసిన వ్యాఖ్యలపై టీడీపీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన కొండ్రు మురళి... అంతకుముందు ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్‌లో వైద్య,ఆరోగ్యశాఖ మంత్రిగా వ్యవహరించారు.

 

కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన కొండ్రు మురళి కోసం టీడీపీ సీనియర్ నాయకురాలు ప్రతిభా భారతికి సీటు నిరాకరించారు చంద్రబాబు. అయితే తాజాగా విశాఖను ఏపీ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ చేయాలన్న సీఎం జగన్ నిర్ణయాన్ని కొండ్రు మురళి బలంగా సమర్థిస్తుండటంతో... ఆయన త్వరలోనే వైసీపీ గూటికి చేరడం ఖాయమనే టాక్ టీడీపీ వర్గాల్లో వినిపిస్తోంది. మొత్తానికి కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన కొండ్రు మురళి వైసీపీలోకి వెళితే... ఆ ప్రభావం ఉత్తరాంధ్ర టీడీపీపై ఏ రకంగా ఉంటుందన్నది రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: