రాజకీయాల్లో ప్రతి విషయానికీ సామాజిక వర్గాన్ని తెచ్చే ప్రయత్నం చేస్తోంది తెలుగుదేశం పార్టీ.. చివరకు శవాల విషయంలోనూ అలాంటి రాజకీయం చేస్తోంది. నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం వెంకట్రావుపల్లి లో ఈనెల 20వ తేదీన మృతి చెందిన దళిత యువతి అనూష కుటుంబసభ్యులను ఆ పార్టీ నేత వర్ల రామయ్య పరామర్శించారు. దళితులపై దాడులు ఆగాలంటే  యంత్రాంగం  చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని తో పాటు చట్టం ముందు అందరూ ఒక్కటే అనే విషయాన్ని నిరూపించాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. 

 

అనూష తల్లిదండ్రులతో మాట్లాడిన వర్ల రామయ్య అనూష మృతిచెందిన గల కారణాలను తెలుసుకున్నారు. యువతి మృతి చెందిన బాత్రూంలో పరిశీలించారు. అక్కడినుంచి ఎస్ఐ, తహశీల్దార్ లకు ఫోన్ చేసి మాట్లాడారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలన్నారు. ఆ తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడుతూ కామాంధుడైన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఆమెను వేధించడం వల్లే చనిపోయిన చనిపోయినట్లు తెలుస్తుందన్నారు. అతనిపై ఐపిసి సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేయాలన్నారు. పేరు వెనక రెండు అక్షరాలు ఉంటే ఏమి కేసులు పెట్టడం లేదంటూ అంటున్నారని, చట్టం ముందు అందరూ ఒకటే అనే నిజంగా పాలనా యంత్రాంగం పనిచేయాలన్నారు. 

 

ఎన్ని చట్టాలు, శాసనాలు చేసిన పాలనా యంత్రాంగం చిత్తశుద్ధితో అమలు చేయకపోతే బూడిదలో పోసిన పన్నీరు అవుతుందన్నారు వర్ల. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం దళితులపై దాడులు చేసినా, ఇతర ఇబ్బందులకు గురి చేసిన చట్టం ప్రకారం చర్యలు తీసుకొని జైలుకు పంపే అవకాశం ఉందన్నారు. పాలనా యంత్రాంగంలో చట్టం పట్ల చిత్తశుద్ధి లేక సరైన న్యాయం జరగడం లేదన్నారు. యువతి అనూష ఆత్మహత్య చేసుకోవడానికి ఎలాంటి ఆస్కారం లేదని తెలుస్తుందన్నారు. 

 

తక్షణమే ప్రభుత్వం యువతి కుటుంబానికి రూ. 10 లక్షల పరిహారంతో పాటు ఆమె సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ తో మాట్లాడి తగిన విధంగా న్యాయం చేసేలా చేస్తామన్నారు. మరి ఇలా ఆధారాలు లేకుండా ఓ సామాజిక వర్గంపై విమర్శలు, ఆరోపణలు ఏంటో..?

మరింత సమాచారం తెలుసుకోండి: