గత నెల 27న దేశాన్ని కాల్చివేసిన ఘటన హైదరాబాద్, షాద్ నగర్ లో జరిగింది. ఆ ఘటన చుసిన ప్రతి ఒక్కరికి కంట నీరు ఆగదు. ఆ ఘటనే దిశ ఘటన. చికిత్స నిమిత్తం బయటకు వెళ్లిన వెటర్నరీ వైద్యురాలైన దిశపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేసి సజీవ దహనం చేశారు. 

 

అయితే ఘటన జరిగిన 24గంటల్లోనే పోలీసులు ఆ నిందితులను పట్టుకోగా.. వారే అత్యాచారం చేసి హత్య చేసినట్టు ఒప్పుకున్నారు. దీంతో వారిని హైకోర్టులో హాజరుపరచగా నలుగురిని 14 రోజులు రిమాండ్ లో ఉంచాలని కోర్టు ఆదేశించింది. అయితే పోలీసులు విచారణలో భాగంగా కేసు రీకాన్స్ట్రక్షన్ లో భాగంగా వారిని ఘటన స్థలానికి తీసుకెళ్లగా అక్కడ పోలీసులపై దాడి చేసి పారిపోవడానికి ప్రయత్నించారు. 

 

దీంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం ఆ నలుగురు నిందితులపై కాల్పులు జరిపారు. ఆ కాల్పులలో నలుగురు నిందితులు మృతిచెందారు. ఇంకా అక్కడే ఆ నిందితులకు పోస్టుమార్టం చేశారు. అయితే ఆ నిందితుల ఎన్కౌంటర్ పై మహిళా సంఘాలు కోర్టులో పిటిషన్ వెయ్యగా ఆ నలుగురి అంత్యక్రియలు పూర్తవుతాయి అనుకున్న సమయంలో కోర్టు అంతక్రియలకు బ్రేక్ వేసింది. 

 

ఆతర్వాత మానవ హక్కుల సంగం బరిలోకి దిగి విచారణ జరపగా.. కోర్టు విచారణ జరిపి జరిపి నిన్న ఆ నిందితుల మృతదేహాలకు రీపోస్టుమార్టం చేసి నిందితుల మృతుదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించారు. దీంతో ఆ నిందితులు డిసెంబర్ 6న మరణించగా నిన్న వారి సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు పూర్తయ్యాయి.

  

అయితే వారి అంత్యక్రియలు చేసే సమయంలో దిశ నిందితుడు అయిన చెన్నకేశవులు భార్య రోదనలు చూసి గ్రామస్థులు సైతం కంట తడిపెట్టారు. చెన్నకేశవులు తల్లి జయమ్మ రోదన చూసి ఈ కష్టం మారే ఏ తల్లికి రాకూడదు అంటూ బాధపడుతున్నారు. కాగా నలుగురి అంత్యక్రియలు వారి వారి సంప్రదాయం ప్రకారం పూర్తయ్యాయి. 

 

కాగా చెన్నకేసువులు భార్య వయసు 13సంవత్సరాలే అని తేలింది. అతి చిన్న వయసులోనే ప్రేమ వివాహం చేసుకొని గర్భందాల్చింది. ఇప్పుడు కడవరకు ఉండాల్సిన భర్త మధ్యలోనే దారుణమైన ఘటనలు చేసి అనంతలోకాలకు వెళ్ళిపోయాడు. కాగా భర్త ఎన్కౌంటర్ గురైన వెంటనే రేణుక రోడ్లపై నిరసనలు చేసి ప్రభుత్వ ఉద్యోగాన్ని, 15 లక్షలు ఆర్ధిక సాయాన్ని, డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ ఇవ్వాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: