తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం జగన్ రాష్ట్రానికి మూడు రాజధానులను ప్రకటించటం వెనుక సీక్రెట్ తెనకు తెలుసని చెప్పారు. చంద్రబాబు జగన్ మూడు రాజధానుల సీక్రెట్ ను రివీల్ చేశారు. చంద్రబాబు చెప్పిన సీక్రెట్ విన్న తరువాత ఆశ్చర్యపోవటం అక్కడ ప్రజల వంతయింది. చంద్రబాబు మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రానికి మూడు రాజధానులు లేవని చెప్పారు. 
 
సచివాలయం అంటే ఉద్యోగులు మాత్రమే కాదని మంత్రులు కూడా ఉండాల్సి ఉంటుందని అన్నారు. సీఎం జగన్ కు ఇవేవీ తెలియవని రాష్ట్రంలోని ప్రాంతాల మధ్య జగన్ మూడు రాజధానుల పేరుతో చిచ్చు పెడుతున్నారని చంద్రబాబు ఆరోపణలు చేశారు. రాష్ట్రంలోని ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుకోవడమే జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన వెనుక వ్యూహమని చంద్రబాబు అన్నారు. చంద్రబాబు మాటలు విన్న ప్రజలు చంద్రబాబు చెప్పిన కారణం విని అవాక్కయ్యారు. 
 
సెక్రటేరియట్, అసెంబ్లీ కట్టినంత మాత్రాన అసెంబ్లీ రాదని అన్నారు. సాఫ్ట్ వేర్ కంపెనీలు, పరిశ్రమలు, పెట్టుబడులు రావాల్సి ఉంటుందని చెప్పారు. వైజాగ్, శ్రీకాకుళం తుఫాన్ల సమయంలో తానక్కడే ఉండి నాలుగురోజులపాటు సహాయక చర్యలు అందించానని తాను పిలుపునిస్తే అందరూ కష్టపడి పని చేశారని చంద్రబాబు అన్నారు. అమరావతి ప్రాంతం ఒక ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గమని చంద్రబాబు అన్నారు. 
 
ఒక వర్గం ప్రజలు ఈ ప్రాంతంలో ఉన్నారు కాబట్టి మిగిలిన అందరినీ జగన్ ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. అమరావతిని రాజధానిగా ఎంపిక చేయటానికి కారణం అమరావతి చారిత్రాత్మక నగరం కావడమేనని అన్నారు. టీడీపీ పార్టీ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటం కొరకు అమరావతి కోసం భూములు త్యాగం చేసిన రైతులకు అండగా ఉంటుందని చంద్రబాబు చెప్పారు. చంద్రబాబు సీఎం జగన్ గురించి చేసిన వ్యాఖ్యలపై వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: