నారా లోకేష్, టీడీపీ అధినాయకుడు చంద్రబాబు కుమారుడు, గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి సిట్టింగ్ ఎమ్యెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి పై ఓడిపోయారు. సాక్షాత్తు అధినాయకుడు కుమారుడు ఎన్నికల్లో ఓడిపోవడంపై టీడీపీ శ్రేణులు విస్మయం వ్యక్తం చేసాయి. నారా లోకేష్ ను మంగళగిరి కాకుండా వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేయిస్తే బాగుండేది అన్న అభిప్రాయం సైతం వ్యక్తం అయింది. లోకేష్ మాత్రం తను మంగళగిరిలోనే పోటీ చేస్తానని, టీడీపీ బలహీనంగా ఉన్న చోటే పోటీ చేసి పార్టీని గెలిపిస్తానని చెప్తూ వస్తున్నారు.

 

తాజాగా సీఎం జగన్ తీసుకున్న ఒక నిర్ణయం లోకేష్ పాలిట వరంలా మారింది. ఏపీ కి మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటించి సంచలనం సృష్టించారు. ఇక జిఎన్ రావు కమిటీ కూడా ఏపీకి మూడు రాజధానులు ఉంటే అభివృద్ధి జరుగుతుంది అనే అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ నిర్ణయంతో అమరావతి రైతుల్లో ఒక్కసారిగా నిరసనలు వెల్లువెత్తాయి. 

 

రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు రోడ్డు ఎక్కారు. దీనితో ఇప్పటి వరకు వైసీపీ కి కంచుకోటగా ఉన్న మంగళగిరి కాస్తా రాజధాని రైతుల నిరసనతో కాస్తా వ్యతిరేకంగా మారింది. సిట్టింగ్ ఎమ్యెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డికి గడ్డు పరిస్థితి నెలకొంది నియోజకవర్గంలో. సరిగ్గా ఇదే విషయం లోకేష్ కు కలిసొచ్చింది. మంగళగిరి నియోజకవర్గంలో రామకృష్ణారెడ్డికి మంచి పేరు ఉంది, ఆర్కే పై గెలుపొందడం అంత సులువు కాదు కానీ జగన్ తీసుకున్న నిర్ణయంపై నియోజకవర్గ ప్రజలకు, రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు ఎలాంటి భరోసా ఇవ్వలేదని ఆర్కే పై గుర్రుగా ఉన్నారు ప్రజలు. లోకేష్ ఇదే ఆయుధంగా వాడుకుని వచ్చే పంచాయతీ ఎన్నికల్లో ఆర్కే ను ఇబ్బంది పెట్టొచ్చని భావిస్తున్నారు. ఏదిఏమైనా సీఎం జగన్ నిర్ణయం లోకేష్ కు కలిసొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: