నవంబర్ 27 అంటే తెలంగాణలో ప్రతి ఒక్కరు భయపడుతున్నారు.  ఆందోళన చెందుతున్నారు.  ఆరోజు రాత్రి దిశపై నలుగురు మృగాళ్లు దారుణంగా రేప్ చేసి హత్య చేసి కాల్చివేశారు.  ఈ ఘటనతో సంబంధం ఉన్న నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నాక, కథ మొదలైంది.  రోడ్డుపైకి జనాలు వచ్చి నిరసనలు చేయడం మొదలుపెట్టారు.  షాద్ నగర్ పోలీస్ స్టేషన్ ను ముట్టడించారు. నిందితులను వెంటనే ఉరితీయాలని లేదంటే 2008లో చేసినట్టుగా నిందితులను ఎన్ కౌంటర్ చేయాలని పట్టుబట్టారు.  


అది చేతకాకపోతే తమకు అప్పగించాలని విద్యార్థిలోకం గర్జన చేసింది.  కానీ, పోలీసులు కట్టుదిట్టమైన భద్రత మధ్య నిందితులను షాద్ నగర్ నుంచి చర్లపల్లి జైలుకు పంపింది.  డిసెంబర్ 4 వ తేదీన పోలీసులు కస్టడీకి తీసుకున్నారు.  డిసెంబర్ 5 వ తేదీన విచారించిన నలుగురు నిందితులను డిసెంబర్ 6 న చటాన్ పల్లి ఫ్లై ఓవర్ వద్ద సీన్ రీ కన్స్ట్రక్షన్ చేసేందుకు తీసుకెళ్లగా అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నం చేస్తున్నారని చెప్పి వారిని ఎన్ కౌంటర్ చేశారు.  


దీంతో పోలీసులు ఒక్కరిగా తెలంగాణాలో హీరోలు అయ్యారు.  కానీ, మానవహక్కుల సంఘం జోక్యం చేసుకోవడంతో నిందితుల మృతదేహాలకు ఖననం ప్రక్రియ ఆగిపోయింది.  డిసెంబర్ 6 వ తేదీన ఖననం చేయాలనీ అనుకుంటే హై కోర్టు, మానవహక్కుల సంఘం జోక్యంతో ఆగిపోయింది.  అప్పటి నుంచి నిందితుల మృతదేహాలను మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీలో రెండు రోజులు ఉంచారు.  అప్పటికే మృతదేహాలు డి కంపోజ్ కావడం మొదలుపెట్టాయి.

 
అక్కడి నుంచి గాంధీలోని మార్చురీకి తరలించారు.  అయితే, మృతదేహాలు కుళ్లిపోతున్నాయని, ఎక్కువ రోజులు గాంధీలో ఉంచలేమని, అధునాతనమైన ఫ్రీజింగ్ సౌకర్యం ఢిల్లీలోని ఎయిమ్స్ లో ఉందని చెప్పింది గాంధీ హాస్పిటల్.  అప్పటికే ఇంజెక్షన్లు ఇచ్చి మృతదేహాలను కొద్దిగా కాపాడుతూ వచ్చారు.  చివరికి నిన్నటి రోజున మరోసారి నలుగురు స్పెషలిస్టులు నేపథ్యంలో రీ పోస్ట్ మార్టం జరిగింది.  అనంతరం నిన్న సాయంత్రం నిందితుల స్వస్థలాల్లో ఖననం చేశారు.  కుటుంబసభ్యుల ఆచారాల మేరకు వాటిని ఖననం చేశారు.  నిందితులు మృతి చెందిన 18 రోజుల తరువాత ఈ ప్రక్రియ జరగడం విశేషం.  

మరింత సమాచారం తెలుసుకోండి: